మమతా బెనర్జీ ఎందుకిలా చేసింది (వీడియో)

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 

 ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా హజరయిన సంగతి తెలిసిందే. అయితే దీదీ వేదిక వద్దకు వచ్చేటప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.

వేదిక వద్దకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యల వల్ల మమతా బెనర్జీకి ఇబ్బంది తలెత్తిందని సమాచారం. ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేదిక వద్దకు చేరుకోవడానికి ఉన్న దారిలో కదలడానికి వీలు లేకుండా వాహనాలతో రోడ్డును మూసివేసారని, దాని వల్ల దీదీ వేదికను చేరుకునేందుకు కొద్దీ దూరం నడిచి వచ్చారని సమాచారం. 

 కర్ణాటక డీజీపీ నీలమణి రాజు వద్ద కూడా మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Scroll to load tweet…