Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు తీపికబురు

  • నిరుద్యోగులకు రైల్వే తీపికబురు
Class 10 minimum qualification for Level 1 posts Railways

నిరుద్యోగులకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలను రైల్వేశాఖ తగ్గించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 62,907 గ్రూప్‌-డి ఉద్యోగాల భ‌ర్తీకి గతనెలలో రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు కనీస అర్హతగా పదోతరగతితోపాటు ఐటీఐ కూడా విద్యార్హత ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.  అయితే.. అదనంగా ఐటీఐ విద్యార్హతగా ప్రకటించడం పట్ల నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో రైల్వే శాఖ ఈ విషయంలో దిగివచ్చింది. విద్యార్హతను పదోతరగతికే పరిమితం చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దరఖాస్తు గడువును కూడా పొడిగించనున్నట్లు తెలిపారు.


గ్రూప్‌-డి ప‌రిధిలో... ట్రాక్‌మ్యాన్‌, గేట్‌మ్యాన్‌, పాయింట్స్‌మ్యాన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్ లాంటి పోస్టులు ఉన్నాయి.  రైల్వే తాజా ప్రకటనతో ఈ పోస్టులన్నింటినీ ఇక పదోతరగతి కనీస అర్హతతోనే భర్తీచేయనున్నారు. ఐటీఐ అర్హత అవసరం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios