Asianet News TeluguAsianet News Telugu

వారిని అందరూ మర్చిపోయినా.. ఆయన గుర్తుంచుకున్నారు..!

  • స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాదులపాత్ర గురించి మట్లాడారు
  • ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయకులు
CJ praises Patels unsung heroes

 

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసలు  స్వాతంత్ర్య దినోత్సవం  అనగానే.. దేశం కోసం పోరాడిన గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారి గురించి ఉపన్యాసాలు ఇస్తారు. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ.. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్  రమేష్ రంగనాథన్ మాత్రం  ప్రపంచం మరిచిపోయిన ఇద్దరు హీరోల గురించి మాట్లాడారు. తన ప్రసంగంలో ఆయన స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాదులపాత్ర గురించి మట్లాడారు.వారే.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయకులు భుల్ బాయ్ దేశాయ్, వీపీ మెనాన్.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రమేష్ రంగనాథన్ నిన్న హైకోర్టు పరిసర ప్రాంతాల్లో జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన భుల్ బాయ్ దేశాయ్, వీపీ మెనాన్ లు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ముందుగా భుల్ బాయ్ దేశాయ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రముఖ న్యాయవాదిగా వ్యవహరించారన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందు ఫోజ్ లో చేరిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అధికారులను భుల్ బాయ్ దేశాయ్ సమర్థించారని తెలిపారు. ఆయన కారణంగానే బ్రిటీష్ ప్రభుత్వ విచారణ నుంచి భారతీయులు విముక్తులయ్యారని రంగనాథన్ గుర్తు చేశారు. అంతేకాకుండా భుల్ బాయ్.. బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన సైమన్ కమిషన్ ని కూడా వ్యతిరేకించారని ఆయన అన్నారు.

అనంతరం ఆయన వి.పి మెనన్ గురించి మాట్లాడుతూ.. ఆయన  సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయకత్వంలోని రాష్ట్రాల మంత్రిత్వ శాఖ సహాయ కార్యకర్తలకు సివిల్ సర్వెంట్ గా వ్యవహరించారన్నారు. 552 రాచరిక రాష్ట్రాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసేందుకు మెనన్ కీలక పాత్ర పోషించారని చెప్పారు.

అంతేకాకుండా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ గురించి కూడా రంగనాథన్ పొగడ్తల వర్షం కురింపించారు. ఆయన గొప్ప తనాన్ని వివరించారు. అనంతరం హైకోర్టు రిజిస్టార్ విద్యాదర్ భట్ చేస్తున్న సేవలను కొణియాడారు. 11 ఏళ్లుగా ఆయనకు హైకోర్టుతో అనుబంధం ఉందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios