టీవీ షో చర్చలో.. నన్ను అవమానించారు.. సినీనటి

టీవీ షో చర్చలో.. నన్ను అవమానించారు.. సినీనటి

ఓ టీవీ ఛానెల్‌ చర్చావేదికలో పాల్గొన్న ముగ్గురు తనను కించపరిచారంటూ ఓ నటి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాల్లో కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌లో గురువారం రాత్రి చర్చ పెట్టారు. అందులో చర్చకు హాజరైన రాఘశృతి అనే సినీనటి తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ సునీత అనే మరో సినీనటి ఫిర్యాదు చేశారు. రాఘశృతి తన ఊరు కావడంతో ఆమెతో స్నేహం చేశానని, దానిని ఆసరాగా చేసుకొని సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ తనతో తప్పుడు పనులు చేయించేందుకు ప్రయత్నించిందంటూ ఆరోపించారు. అంతకుముందు సునీత ఆ టీవీ ఛానెల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆమెను ఠాణాకు తరలించారు. ఈ నేపథ్యంలో సునీత రాఘశృతిపై ఫిర్యాదు చేశారు. చర్చావేదికలో తనకు అవకాశం కల్పించనందుకూ ఆ టీవీ ఛానెల్‌పై కేసు నమోదు చేయాలంటూ శుక్రవారం ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు గురువారం రాత్రి ఓ గుర్తుతెలియని మహిళ స్టూడియోకు వచ్చి తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినట్లు ఛానెల్‌ ప్రతినిధి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos