చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 మహాశివరాత్రి రోజు చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  పండగ పూట శివాలయానికి వెళ్లి తిరిగివస్తున్న ఐదుగురు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బిఎన్ కండ్రిగ వద్ద చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదానికి చెందిన వివరాల్లోకి వెళితే...బీఎన్ కండ్రిగ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్న కొందరు కూలీలు ఇవాళ ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోడానికి ఆటోలో బయలుదేరారు.  ఇక్కడ  దైవదర్శనం చేసుకున్న అనంతరం తిరుగుప్రయాణయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను బీఎన్‌ కండ్రిగ సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు మృత్యవాతపడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా చిత్తూరు జిల్లా యాదమరి, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వాసులుగా
గుర్తించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos