62వ అంతస్తునుంచి అలా పడిపోయాడంతే... (వీడియో)

62వ అంతస్తునుంచి అలా పడిపోయాడంతే... (వీడియో)

గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే ఈ వీడియో చూడాలి. ఇది కేవలం నాలుగు నిమిషాల క్లిప్.

అయితే, ఒక సాహసి చివరిఘడియలను రికార్డు చేసిన ట్రాజెడి వీడియో ఇది. రాత్రిపూట ఈ వీడియో చూస్తే ప్రతి  సెకన్ భరించలేనంత ఉద్వేగాన్ని సృష్టిస్తుంది. సెకన్ కాలం ఎంతకూ అయిపోదేమనిపిసస్తుంది... చివర.. మనం ఉపిరి బిగపట్టి చూస్తుండగానే... సాహసం వికటించి, ప్రయత్నం పట్టు దప్పి,  26 సంవత్సరాల చైనీయుడు 62 అంతస్తుల ఆకాశహర్మ్యం నుంచి జారి... గాలిలో గిరికీలు కొడుతూ.. . కిందపడి చనిపోయాడు.

సాహసి కాని వాడు జీవన సమరానికి రాడని మహా కవి తిలక్ అన్నాడు. ఈ సాహసం ఉపిరిగా బతికిన యాంగ్ నింగ్ కు గత నెల సాహసమే చివరి సాహసమయింది.

 

నింగ్ బల్లిలా భవనాల గోడలను పాకుతూ ... పాకుతూ రూఫ్ టాప్ కెళ్లి పోతాడు. అక్కడ నిలబడుకు పుల్ అప్స్ చేస్తాడు. మళీ వచ్చిన దారిలోనే కిందికి దిగుతూవస్తాడు. ఎత్తుల కెగబాకడంలో నింగ్ ని మించినోడు చైనాలో లేడు.

ఆ మధ్య హూనాన్ రాష్ట్రం రాజధాని చాంగ్షా 62 అంతస్తుల భవనాన్ని నింగ్ ఎగబాకాడు-విజయవంతంగా. ఇదంతా వీడియో కెక్కుతూ ఉంది. పైకెక్కాడు, ఒక అంచుపట్టుని తను చేయాల్సిన ఫీట్స్ చేశాడు ఒక దఫా. చూసే వాళ్లకే కళ్లు తిరిగేంత ఎత్తులో ఆయన పుల్ అప్స్ చేశాడు.  ఆయాసం వస్తే కొద్ది సేకన్లు ఆగాడు... మళ్లీ రూఫ్ టాప్ ఎక్కాలనుకున్నాడు. అయితే, పెకెక్కలేకపోతున్నాడు. చాలా ప్రయత్నం చేశాడు. స్ట్రగుల్ పడ్డాడు. కాలేదు. ఒక ఇరవై సెకన్లు ఆగి మళ్లీ ప్రయత్నం చేశాడు. బాడీ అదుపులోకి రాలేదు. పైన అంచుదగ్గిర గ్రిప్ సడలేటట్లు ఉంది. ఇలాంటిది గతంలో ఎపుడూ జరగలేదు. ఇపుడేమవుతున్నది.... ఏమవుతున్నది... తాను 62 వ అంతస్థు ఎత్తు లో ఉన్నాడు. ఒకటి, రెండు, మూడు... నింగ్ ప్రయత్నం ఫలించలేదు. అంతే,వేళ్లు పట్టుతప్పాయి.  62 వ అంతస్తు నుంచి పడిపోయాడు. ఒక సాహసి జీవితం విషాదంగా ముగిసింది.

 

ఇది నవంబర్ 8న జరిగింది. నింగ్ చనిపోయిన విషయం ప్రపంచానికి తెలియదు. డిసెంబర్ పదో తేదీన సోషల్  మీడియాలోకి  దూమారం సృష్టించింది.  తన వీడియో లన్నింటిని నింగ్ చైనీస్ సోషల్ మీడియా పోస్టు చేసేవాడు. అయితే, నెల రోజుల పాటు నింగ్ meipai అకౌంట్ లో లేటెస్టు పోస్లు లేవీ లేకపోవడంతో ఆయన 235,000 మంది ఫాలోయర్లు ఆందోళన చెందారు. అయితే, చివరకు ఆయన గళ్ ఫ్రెండ్ డిసెంబర్ 8వ తేదీన తన weibo అకౌంట్ లో నింగ్ మరణ వార్త ను ఆవేదనతో పోస్టు చేసింది. ‘‘Today is December 8th. It makes me think of November 8th, the day that you left us, left this world", అని ఆమె ధృవీకరించింది. డిసెంబర్ 10 తేదీన ఆయన చివరి సాహసం రికార్డయిన వీడియో క్లిప్ బయటకొచ్చింది. 

 

నింగ్ ఇంత ప్రమాదకరమయిన జీవిత యాత్రను ఎందుకెంచుకున్నాడో తెలుసా?

నమ్ము నమ్మక పో, అదొక సినిమా కథ లాగుటుంది. అనారోగ్యంతో ఉన్న  తల్లి మందులకోసం ఆయన సాహసాన్ని వాడుకున్నాడు. ఈ సాహాసకృత్యం వీడియోలను ఇంటర్నెట్ లో  పోస్టు చేసి వచ్చే డబ్బును తల్లి వైద్యానికి వాడేవాడు.

నిజానికి ఆయన  సాహస కృత్యాలక అధికారుల అనుమతి కూడా లేదు.  ఇదంతా ‘రూఫ్ టాపింగ్ ’ అనే ఇల్లీగల్ యాక్టివిటి అంటున్నారు. కేవలం ఇంటర్నెడ్ వ్యూయరషిప్ కోసం తద్వార నాలుగు రూకలు సంపాదించేందుకు వీడియోల కోసం, సెల్ఫీ కోసం ఎంచుకున్న సర్వైవల్ స్ట్రాటజీ రూఫ్ టాపింగ్.

రెస్ట్ ఇన్ పీస్.

ఇదే వీడియో...

 

 

 

 

 

 


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos