ఇది ఈ వీడియోని చైనావాళ్లు తెగ చూసేశారు. డిసెంబర్ నాలుగో తేదీనుంచి ఇది  తెగ వైరల్ అయింది. ఇపుడిది ఇలా అన్ని దేశాల్లోకి ఎగబాకుతూ ఉంది. కారణం, చైనా సిఐడి డిప్యూటి హెడ్ చెన్ షికు (Chen Shiqu) ఒక రకం బట్ట తయారు చేశాడు. అది చాలా పారదర్శకమయిన దారంతో తయారుచేశారు. పారదర్శకంగా ఉన్నా, దీనికి చాటుగా మనిషి నిలబడితే మనిషి కనిపించడు. అంటే ఈ క్లాత్ మనిషిని మాయం చేస్తుందన్నమాట.

 

 దొంగలను పట్టుకునేందుకు వెళ్లేపోలీసులు ఇలాంటి బట్టతో తయారుచేసిన డ్రెస్ వేసుకుని వెళితో అవతలి వారికి కనిపించరని అపుడు వారిని పట్టుకోవడం ఈజీ అనేది చెన్ షికు చెబుతాడు. ఈ బట్టని ఆయన తోటలో ప్రదర్శించి చూపాడు. బట్టచాటున నిలబడుకోగాని ఆయన శరీరం మాయవుతుంది. ఇలాంటి దేవతా వస్త్రాలు మనం పురాణాల్లోన్, విఠలాచార్య సినిమాల్లోనో, సైన్స్ ఫిక్షన్ లోనో చూశాం. అయితే, చెన్ షికు ఇపుడు దీన్ని నిజం చేసి చూపించాడు. దీనికి సంబంధించి వీడియో ఇది. దీనికి చెన్ వివరణ కూడా ఇచ్చారు. మనకు ఏదైనవస్తువు కనిపించాలంటే, ఆవస్తువు తన మీద పడిన కాంతికిరణాలను రిఫ్లెక్ట్  చెందించాలి. అపుడు రిఫ్లెక్షన్ ను మనం కన్ను ఆ వస్తువు ఆకారంలో స్వీకరిస్తుంది. అదేవస్తువుగా కనిపిస్తుంది. ఈ ధియరీ ప్రకారం, చెన్ తయారు చేసిన క్లాత్  కిరణాలను  అబ్జార్బ్ చేసుకుంటుంది. రిఫ్లెక్షన్ ఉండదు.అందువల్ల మనిషి కనిపించడు. ఇది క్లాంటమ్ మెకనిక్స్ అధారంగా జరిగింది కాబట్టి, ఈ బట్టకి ఆయన క్వాంటమ్ ఇన్విజిబిలిటి క్లోక్ అని పేరు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని చైనాసోషల్ మీడియమ్ weibo లో పోస్టు చేస్తే 21.4 మిలియన్ వ్యూలు వచ్చాయి. ఇది ఇదే వీడియో.

 

అయితే, ఇందులో తిరకాసు ఉందని చెబుతున్నారు సాఫ్ట్ వేర్ నిపుణులు. అది వేరేకథ.