మరో సారి భారత్ పై వరుచుకు పడ్డ చైనా దోవల్ వచ్చిన సమస్య తగ్గదట.
చైనా ప్రతి రోజు ఎదో ఒక కామేంట్ చేస్తు తన అహాంకారం బయట పెట్టుకుంటుంది. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కారం కన్న సమస్యను పెంచడానికి ప్రయత్నిస్తుంది. గతంలో చైనా, భారత్ తమ బలాన్ని తక్కువ అంచానా వేస్తున్నారని అక్కడి విదేశీ శాఖా మంత్రి అన్నారు. త్వరలో చైనాలో బ్రిక్స్ సమావేశం జరగనుంది. అందులో భారత్ నుండి జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ పాల్గోననున్నారు. ఈ నేపథ్యంలో చైనా వచ్చినంత మాత్రాన ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం అవుతందని భారత్ భావించొద్దని పేర్కొంటూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ తాజాగా ఓ కథనాన్ని వెలువరించింది.
జూలై 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ సలహాదారుల సమావేశం చైనాలో జరగనుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం మరింత రాజుకుంటుంది. అయితే కనీసం ఈ సమావేశం అనంతరం సరిహద్దు వివాదం సర్దుమణుగుతుందని అనుకుంటే, చైనా గ్లోబల్ టైమ్స్ అజిత్ దొవల్ వచ్చినంత మాత్రనా సమస్యల పరిష్కారం కాదని అన్నది. అక్కడ రాజకీయ నాయకుల కన్న మీడియానే ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలను పెంచుతుందని న్యూయార్క్ టైమ్స్ పచురించింది.
