చైనా బీబర్ ని బ్యాన్ చేసిందిబీబర్ ప్రవర్తన కారణంప్యాన్స్ ఆగ్రహాం.
జస్టిన్ బీబర్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న పాప్ స్టార్. అయితే గత ఆరు నెలల నుండి ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. అందులో భాగంగా మే చివరి వారంలో ఇండియాలోని ముంబాయిలో తన ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సంవత్సరం చివరి మాసంలో ఆసియా యాత్ర ఉంది. అందులో ఇండినేషియా, జపాన్, చైనా దేశాలలో బీబర్ తన ప్రదర్శనలకు తేదీలు కూడా పిక్స్ అయ్యాయి.
కానీ జస్టిన్ బీబర్ ని చైనా దేశం బ్యాన్ చేసింది. బీబర్ ని తమ దేశంలో అడుగుపెట్టనివ్వమని అక్కడి ప్రభుత్వం తెలిపింది. కారణాలు తెలుపుతు జస్టిన్ బీబర్ కు సరైన ప్రవర్తన లేదని, గతంలో చైనా లో పర్యటించినప్పుడు చాలా వర్గల్‌గా ప్రవర్తించాడని తెలిపారు. అంతేకాదు. తన పర్సనల్ జీవితం కూడా సరిగ్గా ఉండకపోవడం మరో కారణంగా అక్కడి ప్రభుత్వం బీబర్ ని బ్యాన్ చేసింది.
కానీ చైనా లోని జస్టిన్ బీబర్ ప్యాన్స్ అక్కడి ప్రభుత్వం పై ఆగ్రహాంగా ఉన్నారు.
