Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ ఏడ్చారు!

  • తాను చదువుకున్న పాఠశాలను సందర్శించిన సీజేఐ
  • 50 ఏళ్లుగా అక్కడి పరిస్థితి మారకపోవడంపై ఆవేదన
Chief Justice Thakur in tears

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ మరోసారి కంటతడి పెట్టుకున్నారు. దేశంలో తగినంతమంది జడ్జీలు లేరని, ఉన్నవారిమీద పనిభారం తీవ్రంగా పడుతోందని, కేసుల పెండింగ్ వల్ల సామాన్యులకు న్యాయం అందకుండా పోతుందని జస్టిస్ ఠాకూర్ గతంలో కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే.

 

గతంలో ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ప్రధాన మంత్రి మోదీ తదితరుల సమక్షంలోనే ఆయన ప్రభుత్వ నిస్సాహాయతపై ఆవేదన చెందారు. తాను చాలా సున్నిత మనస్కుడినని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.

 

ఇటీవల తాను ప్రాథమిక విద్య అభ్యసించిన జమ్మూలోని పాఠశాలను సందర్శించిన అనంతరం అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు.

 

50 ఏళ్లలో  అంగారక గ్రహానికి కూడా చేరుకున్నాం. కానీ మా స్కూల్లో మౌలిక వసతులు కూడా ఇప్పటికీ కల్పించుకోలేక పోయాం అని సీజేఐ వాపోయారు. 50 ఏళ్ల కిందట తాను చదువుకునేటప్పుడు ఉన్నట్లుగానే స్కూళ్లో విరిగిన కుర్చీలున్నాయన్నారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios