ఆ బ్యాంకుల చెక్ బుక్ లు ఇక చెత్తబుట్టలోకే

First Published 27, Dec 2017, 1:46 PM IST
Check out if your cheque books will become invalid from January
Highlights
  • చెక్ బుక్ లు మాత్రమే కాదు.. ఆ బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు కూడా పనిచేయవు.
  • ఇంతకీ ఆ బ్యాంకులు ఏమిటో తెలుసా..?
  • ఆందోళనలో ఖాతాదారులు

డిసెంబర్ 31వ తేదీ తర్వాత కొన్ని బ్యాంకులకు సంబంధించిన చెక్ బుక్ లు ఎందుకు పనికిరావు. చెక్ బుక్ లు మాత్రమే కాదు.. ఆ బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు కూడా పనిచేయవు. ఇంతకీ ఆ బ్యాంకులు ఏమిటో తెలుసా..? స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్ పూర్, స్టేట్ బ్యాంక్ ట్రావెన్ కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు.

ఈ ఏడాది ప్రారంభంలోనే.. ఈ బ్యాంకులన్నీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీలనమైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బ్యాంక్ ల ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే తమ వద్ద ఉన్న చెక్ బుక్ లను మార్చుకోవాలని, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను తెలుసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు గతంలోనే సూచించింది. వాస్తవానికి పాత్ చెక్ బుక్‌లను మార్చుకునేందుకు గతంలో సెప్టెంబర్ 30వ తేదీని ఎస్బీఐ గడువుగా నిర్ధారించింది. ఆ తర్వాత గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ గడువు కూడా సమీపిస్తుండడంతో తాజాగా ఆ ఆరు బ్యాంకుల ఖాతాదారులకు మరోసారి సూచన చేసింది. కొత్త చెక్ బుక్ లను పొందడానికి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌‌లు తెలుసుకోవడానికి సమీపంలోని ఎస్‌బీఐ శాఖలను సంప్రదించవచ్చని, లేకపోతే ఏటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా వీటిని పొందవచ్చని ప్రకటించింది.
 

loader