Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే ఫస్ట్ : చర్లపల్లి జైల్లో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు

జైళ్ళ శాఖ డిజి వికె సింగ్ వినూత్న ప్రయోగంతో హైదరాబాద్ జైలొకటి పోస్టుగ్రాజుయేట్ సెంటర్ కాబోతున్నది. చర్ల పల్లి కేంద్ర కారాగారం తొందర్లో సైకాలజీలో ఎమ్మెస్సీకోర్సు ప్రారంభిస్తున్నది.  కేవలం  ఖైదీలకే  అడ్మిషన్ ఉంటుంది. మొదటి విడత నలభై మంది ఖైదీలు మాస్టర్స్ కోర్సులోచేరబోతున్నారు. ఈ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి కూడా ఇచ్చింది.

charlapalli jail to start postgraduate course in psychology

charlapalli jail to start postgraduate course in psychology

 

హైదరాబాద్ జైలొకటి పోస్టుగ్రాజుయేట్ సెంటర్ కాబోతున్నది. చర్ల పల్లి కేంద్ర కారాగారం తొందర్లో సైకాలజీలో ఎమ్మెస్సీకోర్సు ప్రారంభిస్తున్నది. ఇందులో కేవలం  ఖైదీలకే  అడ్మిషన్ ఉంటుంది. మొదటి విడత నలభై మంది ఖైదీ మాస్టర్స్ కోర్సులోచేరబోతున్నారు. ఈ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి కూడా ఇచ్చింది.

 

ఇదేదో ఆషామాషీగా ప్రారంభమవుతున్న కోర్సు కాదు. దీని వెనక చాలా పరిశోధన, అధ్యయనం ఉంది. శిక్ష పూర్తయ్యాక జైలు గోడలు దాటి విశాల సమాజంలోకి వెళ్లేందుకు ఖైదీలను సమాయత్తం చేయాలి. వాళ్లు తలెత్తుకుని బయటికడుగు వేయాలి.వాళ్లు  సాధారణ పౌరులుగా తిరిగొచ్చారని గాసమాజం సాదరంగా అహ్వానించేాలా   వీళ్లలో పరివర్తన తీసుకురావాలి. ఎలా? ఏమయినా సరే ఇలాంటి ప్రయత్నం చేసి తీరాలని  జైళ్ల శాఖ డిజి  వి.కె సింగ్ (పక్క ఫోటో) భావించారు.charlapalli jail to start postgraduate course in psychology

 

 ఖైదీలను నేరస్తులనే ముద్రతో ఇంటికి పంపకూడదనేది ఆయన ఉద్దేశం. దీనికోసం చాలాశ్రమ తీసుకున్నారు. ప్రవర్తనా పరివర్తనతో పాటు, మానసిక స్థితిలో కూడా మార్పు తీసుకురావాలనే పట్టుదల ఆయనను అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు వుసి గొల్పింది. మేధావులను,యూనివర్శిటీప్రొఫెసర్లను సంప్రదించారు. వర్క్ షాపులను ఏర్పాటుచేశారు.ప్రత్యేక తరగతులను నడిపించారు. ఈ ప్రయత్నం చాలా దృఢసంకల్పంతో ప్రారంభించారాయన. దీనితో జైలులో విద్యాలయ వాతావరణ నెలకొనడం మొదలయింది. ఇదే సమయంలో కుటుంబాలకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ కృషి చివరకు మాస్టర్స్ కోర్సు ప్రారంభానికి దారితీసింది.

 

" ఖైదీలలో చాలా మంది గ్రాజుయేట్స్ ఉన్నారు. ఇది మాకు ఉత్తేజాన్నిచ్చింది. మా జైలు కొచ్చేటపుడు వీరంతా క్రిమినల్స్. వీళ్లందరిని డీక్రిమినైలైజ్ చేసి,గతం వీరిని వెంటాడకుండా చేయాలనేది మా  ఉద్దేశం," అని జైళ్ల ఐజి ఇ. నరసింహన్ చెప్పారు.  ఈ కోర్సు రూపకల్పనలో రిటైర్డు సైకాలజీ ప్రొఫెసర్ బినా బాగా సహకరించారని ఆయన చెప్పారు.

 

“ఇలాంటి ప్రయత్నం దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరగలేదు. డిజి వికె సింగ్  నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రయత్నం వినూత్నప్రయోగం. తెలంగాణా ఖైదీల సంస్కరణలో ఆదర్శమవుతుంది.ఖైదీల మానసిక స్థితిలో సమూలమయిన,సక్రమమయిన మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నాం,’ అని నరసింహం అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios