పైకి ఉద్దానం అజండా అయినప్పటికీ,  బాబు, పవన్  కీలకమమయి రాష్ట్ర రాజకీయాలను  సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. నంద్యాల నోటిఫికేషన్  ఏ రోజయినా వెలువడే అవకాశం ఉన్నందున ఉప ఎన్నికలలో బాబు పవన్ మద్దతు కోరే అవకాశం లేకపోలేదని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశం ఖరారయింది. జూలై 31న వారిద్దరు సమావేశం కానున్నారు. గత వారంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉండింది. అయితే అనుకూల ముహూర్తం కుదరనందున సమావేశం జరగలేదు. ఇపుడు వారిరువురు కలసి మాట్లడాలని నిర్ణయించుకున్నారు. పైకి ఉద్దానం అజండా అయినప్పటికీ, బాబు, పవన్ చాలా కీలకమమయి రాష్ట్ర రాజకీయాలను చర్చించనున్నట్లు తెలిసింది. నంద్యాల నోటిఫికేషన్ ఏ రోజయినా వెలువడే అవకాశం ఉంది. నంద్యాల ఉప ఎన్నికల గురించిపవన్ ఇంతవరకు నోరు విప్పలేదు. 2019 ఎన్నికలలో పోరాడతాను అనే మనిషి నంద్యాల లో ఉప ఎన్నిక జరిగితే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. అన్ని పార్టీలో పోటీకి సిద్ధంగా ఉన్నాయి. చివరకు రాయలసీమ సమస్య మీద బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడ అభ్యర్థిని నిల బెడతానంటున్నారు. ఒక పెద్ద పార్టీగా మారబోతూ, నంద్యాల గురించి మాట్లాడని నాయకుడు పవన్ ఒక్కరే. ఏదో విధంగా, నంద్యాల ఎన్నికలలో తెలుగుదేశం అనుకూలంగా ఒకసందేశం పంపమని లేదా డైరెక్టుగా మద్దతు ప్రకటించాలని చంద్రబాబు పవన్ ని కోరే అవకాశం ఉందని తెలుగుదేశం నాయకులొకరు ‘ఎషియానెట్‘ తెలిపారు. దీనికోసం ఉద్ధానం కోసం ఒక భారీ ప్రకటన ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. ఇదే విధంగా వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్తూ ఉండటం, మోదీ ప్రభుత్వం రాష్ట్రం మీద ఆశించినంత దృష్టి పెట్టకపోవడం చర్చకు రావచ్చని ఆయన చెప్పారు.

ఇక ఉద్దానం పబ్లిక్ విషయాని కొస్తే... శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ బాధితుల సమస్యల ఈ సమస్యను హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ దాకా తీసుకువెళ్లారు. ఆమధ్య అమెరికా వెళ్లి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించి ఈ విషయాన్ని అక్కడి మేధావుల ముందర పెట్టారు. మెడికల్‌ స్కూల్‌ వైద్యులతో మాట్లాడారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. ఫలితంగా

స్కూల్‌ రీజినల్‌ విభాగం ముఖ్య వైద్యుడు జోసెఫ్‌ బెన్వంత్రీ నేతృత్వంలో ఒక బృందం ఈ నె 29న జోసెఫ్‌ బృందం ఉద్దానంలో పర్యటిస్తుంది. అనంతరం 30న విశాఖపట్నంలో హార్వర్డ్‌ వైద్యులతో పవన్‌ సమావేశమవుతారు. తర్వాత పవన్‌, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడనున్నారు.