Asianet News TeluguAsianet News Telugu

చాందిని జైన్ హత్య వెనుక విస్తుపోయే నిజాలు

  • వెలుగు చూస్తున్న నిజాలు
  • తనను ప్రేమిస్తూనే మరో ఇద్దరితో చాందిని సన్నిహితంగా మెదులుతోందనే అక్కసుతోనే ఈ ఘాతుకం
  • పబ్ కల్చర్  కి అలవాటు పడుతున్న విద్యార్థులు
Chandini death exposes dark underbelly of social media

నగరంలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్(17) హత్య కేసును పోలీసులు చేధించారు. ఆమె ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే.. ఆమె హత్య వెనుక ఉన్న కారణాలు తెలిసి పోలీసులే విస్తుపోయారు. కేవలం తల్లిదండ్రుల సరైన పర్యవేక్షణ లేకపోవడం, మితి మీరి సోషల్ మీడియాను వినియోగించడమే అందుకు కారణమని తెలుస్తోంది.

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. చాందిని హత్య జరగడానికి కొద్ది రోజుల క్రితం..హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు పార్టీ జరిగింది. టర్డ్‌మన్‌ పేరుతో ఐక్యరాజ్యసమితి నమూనాపై విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ జరిగింది.ఈ పార్టీని నగరానికి చెందిన ఓ యువకుడు(మైనర్) నిర్వహించాడు. రూ.1.80లక్షలు ఖర్చు పెట్టి నిర్వహించిన ఈ పార్టీకి  52మంది మైనర్లు హాజరయ్యారు.  వారిలో చాందిని కూడా ఉంది. విస్తుపోయే విషయం ఏమిటంటే.. వీరంతా సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. 


ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.3వేలు సేకరించి.. ఫ్రముఖ హోటల్ లో రూ.2,500 పెట్టి రూమ్లు కూడా బుక్ చేశాడు.మూడు రోజులపాటు వారంతా ఆ హోటల్లోనే బస చేసి సోషల్ మీడియా  అంటే ఫేస్ బుక్, వాట్సాప్, స్నాప్ చాట్ వంటి వాటి గురించి చర్చించారట.పబ్ కల్చర్ ని తలపించేలా పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. ఆ పార్టీలో వారంతా మద్యం కూడా సేవించినట్లు తెలుస్తోంది. అక్కడ నాగా, సాహిల్ అనే ఇద్దరు  విద్యార్థులు చాందినికి పరిచయమయ్యారు.వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియా వెబ్ సైట్లలో పోస్టు చేసింది. ఈ విషయంపై ఆగ్రహం చెందిన సాయి కిరణ్.. చాందినిపై కక్ష పెంచుకున్నాడు. తనను ప్రేమిస్తూనే మరో ఇద్దరితో చాందిని సన్నిహితంగా మెదులుతోందనే అక్కసుతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సాయి కిరణ్ అంగీకరించాడు.

దీనిపై సైబరాబాద్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. పిల్లల గురించి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘాతుకాలు జరుగుతున్నాయన్నారు.వారి ఫోన్లను పేరెంట్స్ చెక్ చేస్తూ ఉండాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు. ఎమి చేస్తున్నారనే విషయాలను ఆరా తీయాలన్నారు. చాందిని స్నేహితులను దాదాపు 30మందిని విచారించామని పోలీసులు చెప్పారు. అందులో కొందరు విద్యార్థులు తమ ఫోన్లను ఇవ్వడానికి కూడా అంగీకరించలేదని వారు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios