చైతన్యపురి కార్పోరేటర్ కొడుకుపై దుండగుల దాడి (వీడియో)

చైతన్యపురి కార్పోరేటర్  కొడుకుపై దుండగుల దాడి (వీడియో)

 

హైదరబాద్ మలక్ పేటలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ వైన్ షాప్ యజమానిని చితకబాది అతడి దగ్గరున్న క్యాష్ బ్యాగ్ ను లాక్కుని పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైన్స్ యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే చైతన్యపురి కార్పోరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి కొడుకు మలక్ పేట్ లో వైన్ షాప్ నడిపిస్తున్నాడు. అతడు నిన్న రాత్రి షాప్ మూసేసి ఆ రోజు కలెక్షన్ డబ్బును తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే ఆయనపై దాడిచేయడానికి అప్పటికే కాపుకాసిన దుండగులు షాప్ బయటకు రాగానే పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అతడు తీవ్ర గాయాలతో కిందపడిపోగా డబ్బుల బ్యాగ్ ను లాక్కుని పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైన్స్ యజమాని ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.   

తన కొడుకుపై జరిగిన దాడిపై కార్పోరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి స్పందించారు. గతంలో వైన్స్ షాప్ నిర్వహణ విషయంలో స్థానిక తెరాస నేత భాస్కర్ రెడ్డి తో వివాదం తలెత్తిందని, ఆ పగతోనే తన కొడుకుపై దాడి చేయంచాడని ఆరోపిస్తున్నాడు.  ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos