ఏదో ఓ రూపంలో పార్టీలోని అసమ్మతి బయటపడి ఎవరిదారి వారు చూసుకుంటారు. పార్టీ మారాలనుకుంటున్న వారిని నివారించటమే చంద్రబాబుకు ఇపుడు పెద్ద సమస్యగా మారుతుంది.

చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం వరుసపెట్టి షాకులు ఇస్తూనే ఉంది. తాజాగా నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని తేల్చేసింది. వైసీపీ ఎంపి వైవి సుబ్బారెడ్డికి కేంద్ర హోంశాఖ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగాన్ని సవరించనిదే నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కూడా తేల్చేసింది. రాజ్యసభలో తగినంత మెజారిటీ లేని కారణంగా కనీసం 2018 వరకైనా సాధ్యం కాదని కేంద్రం స్పష్టంగా చెప్పటం గమనార్హం. పైగా సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాలట. ప్రత్యేకహోదా, ఆర్ధికలోటు సర్దుబాటు చేయటం కుదరదన్నది, రాజధాని నిర్మాణానికి సరిపడ నిధులు ఇవ్వటం లేదు. ప్రత్యేకహోదానూ తూఛ్ అన్నది. ప్రత్యేక రైల్వేజోన్ పైనా ఏవో కథలు చెబుతోంది. పోలవరం వ్యయాన్ని భరించే విషయంలోల మొన్ననే పెద్ద షాక్ ఇచ్చింది. ఇపుడు తాజాగా నియోజకవర్గాల పెంపును కూడా తోసిపుచ్చింది.

ఈ మొత్తంలో స్పష్టంగా తేలుతున్నదేమంటే కేంద్రం ఒకటి చెబుతుంటూ ‘నాయుళ్లు’ మాత్రం మొదటి నుండి జనాలను మభ్యపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని. హోంశాఖ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని ఎప్పుడు చెప్పినా వెంటనే వెంకయ్యనాయుడు రంగంలోకి దిగేస్తారు. హోంశాఖ పాత విషయాలను చెబుతున్నదని, డ్రాఫ్ట్ కూడా సిద్ధమైపోతుందని చెబుతుంటారు. తాజా సమాధానం చూస్తుంటే వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఇంతకాలం చెబుతున్నదంతా ఒట్టి డొల్లే అన్నది తేలిపోయింది.

నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అందరికీ సర్దుబాటు చేస్తానంటూ చంద్రబాబు వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్నారు. ఇటీవల జరుగుతున్న జిల్లాల సమీక్షల్లో కూడా చాంద్రబాబు పార్టీలోని సీనియర్లకు అదే విధమైమ హామీలిస్తున్నారు. ఇపుడు గనుక నియోజకవర్గాలు పెరగకపోతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు, పార్టీలోని సీనియర్లకు మధ్య ఆధిపత్య పోరాటాలు తీవ్రంగా ఉన్నాయి. నియోజకవర్గాల పెరగవన్న విషయం తెలిపోతుండటంతో చివరకు అందరూ కొట్టుకుని రోడ్డున పడటం ఖాయం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావనుకున్న వారు వెంటనే వైసీపీలోకి మారిపోవటం తథ్యం.

ఇటు ఫిరాయింపు ఎంఎల్ఏలను అటు పార్టీలోని సీనియర్లను మభ్యపెడుతూ వచ్చే ఎన్నికల వరకూ పబ్బం గడుపుకుందామని చంద్రబాబు చూస్తున్నారు. ఇపుడు ఆ ప్రయత్నాలు ఎన్నోరోజులు సాధ్యం కాకపోవచ్చు. ఏదో ఓ రూపంలో పార్టీలోని అసమ్మతి బయటపడి ఎవరిదారి వారు చూసుకుంటారు. పార్టీ మారాలనుకుంటున్న వారిని నివారించటమే చంద్రబాబుకు ఇపుడు పెద్ద సమస్యగా మారుతుంది.