రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఎన్నో సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వాటి పరిష్కారానికి మాత్రం ఇద్దరూ సమయం కేటాయించలేకపోతున్నారు. అటువంటిది ఈ విషయంలో మాత్రం ఏకమయ్యారు.

మొత్తానికి తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారట. అందుకే వారి ఒత్తిడి కేంద్రంపై పనిచేస్తున్నట్లే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయంగా కేంద్రం సుముఖంగా ఉన్నట్లు హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తెలిపారు. బహుశా వచ్చే జూలైలో ఈ విషయమై సానుకూల ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్నారు. సీట్ల సంఖ్యపై చాలా కాలంగా సందిగ్దం నెలకొన్నది. సీట్ల సంఖ్య పెంపును దృష్టిలో పెట్టుకునే ఇద్దరు ముఖ్యమంత్రులూ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నది నిర్వివాదాంశం. రేపటి రోజున నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే మాత్రం ఇటు కెసిఆర్, అటు చంద్రబాబునాయుడులకు ఇబ్బందులు తప్పవు.

సీట్లసంఖ్య పెంపు సాధ్యం కాదని ఒకవైపు ఎన్నికల కమీషన్, ఇంకోవైపు హోంశాఖ సహాయమంత్రి హంసరాజ్ ఇప్పటి వరకూ చెబుతూ వచ్చారు. అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పట్టు విడవకుండా వెంకయ్యనాయడు ద్వారా ప్రధానమంత్రిపై తీవ్ర ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంతకాలం కేంద్రం చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా రాజ్ నాధ్ సీట్ల పెంపుకు సానుకూలంగా ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సీట్ల పెంపుపై ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఎన్నో సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వాటి పరిష్కారానికి మాత్రం ఇద్దరూ సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం ఏకమయ్యారు. ఎందుకంటే, సీట్ల సంఖ్య పెంపన్నది వారి రాజకీయ భవిష్యత్తుకు ముడిపడినది కాబట్టే అదికూడా కేంద్రమంత్రి వెంకయ్యనాయడు మద్దతుతోనే సీట్లను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలోనూ ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోయినా నియోజకవర్గాల పెంపు విషయంలో మాత్రం ఒకే లక్ష్యంతో ప్రయాణిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణాలో కెసిఆర్ సుమారు 25 మంది టిడిపి, కాంగ్రెస్ ఎంఎల్ఏలను, ఏపిలో చంద్రబాబు 21 మంది వైసీపీ ఎంఎల్ఏలను తమ పార్టీల్లోకి లాక్కున్నారు. ఆ మధ్య జిల్లాల వారీగా జరిగిన సమీక్షల్లో కూడా సీట్ల సంఖ్య పెరుగుతాయనే ఇద్దరు సిఎంలు చెప్పారు. వారు చెబుతున్న మాటలపై చాలా మంది నేతల్లో నమ్మకాలు లేకపోయినా చేసేదేంలేక మౌనంగా ఉంటున్నారు. అటువంటి నేపధ్యంలోనే రాజ్ నాధ్ సింగ్ చేసిన ప్రకటన ఫిరాయింపులతో పాటు పార్టీల్లో ఉండే సీనియర్ నేతల్లో ఆశలు పూసియిస్తున్నాయ్.