తెలంగాణలో డబ్బుల్లేక, రెండు వేల నోటుకు చిల్లర లేక ప్రజల పడ్తున్న బాధలను చూసేందుకు మోదీ దూతలొస్తున్నారు

అయిదొందలు,వేయి నోట్ల అకస్మిక రద్దుతో ప్రజలు పడుతున్న అగచాట్లను పరిశీలించడానికి బుధవారం కేంద్ర బృందం తెలంగాణా వస్తున్నది.

ఈ బృందం రెండురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తుంది.

నవంబర్ ఎనిమితో తేదీన ప్రధాని నోట్ల రద్దు ప్రకటన తర్వాత తలకిందలవుతున్న ప్రజాజీవనాన్ని పరిశీలించేందుకు కేంద్రబృందాలను పంపాలని ప్రధాని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఒక బృందం తెలంగాణా వస్తున్నది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి సుబ్రమణ్యం ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం అయిదారు అంశాలను పరిశీలిస్తుంది.

అవి : బ్యాంకులు ఎటిఎంలలో నోట్ల అందుబాటు ఎలా ఉంది, నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఉన్న ఏర్పాట్లు, కొత్తనోట్ల వచ్చేందుక ఎంటిఎం ల రీక్యాలిబ్రేషన్ పూర్తయిందా లేదా, నోట్ల ర ద్దు ప్రభావం కుటుంబాల మీద ఎలా ఉంది, స్థానికంగా తలెత్తిన ఇతర సమస్యలు.

ఈ బృందం పర్యటించాల్సిన ప్రాంతాలు, పరిశీలించాల్సిన అంశా లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

చిల్లర నోట్లను విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల దగ్గిర,ఎటిఎంల దగ్గిర చాంతాడంతటి క్యూలలో నిలబడుకుంటున్న ప్రజలు, ఖాళీ అయిన బ్యాంకులు, ఎటిఎంలు, రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయంగా తగ్గిన ఆదాయం గురించి బృందానికి అధికారులు వివరిస్తారు.

బుధవారం ఉదయం 11 గంటలకు సీఎస్ రాజీవ్‌శర్మతో కేంద్రబృందం భేటీ అవుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తుంది.