వైఎస్, జగన్ లను దొంగలతో పోల్చిన రాజుగారు

central minister ashok gajapathiraju fires on ys and jagan
Highlights

  • జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి
  • రాజుగారి విమర్శలకు ఆశ్చర్యపోతున్న సొంతపార్టీ నేతలు

వైసీపీ అధ్యక్షుడు జగన్ కి వస్తున్న ప్రజాధారణను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆయనపై టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయారు. కాకపోతే.. అందరికన్నా నాలుగు అడుగులు ముందుకేసి మరీ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉన్న ఆయన... ఇలాంటి విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే.. శనివారం విశాఖ జిల్లా కృష్ణదేవి పేటలో అశోక్ గజపతిరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లను దొంగలతో పోల్చాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.43వేల కోట్ల ప్రజాధనాన్ని దిగమింగాడని.. అది రుజువైందని ఆరోపించాడు. కాగా.. వాస్తవానికి వైస్ ప్రజా ధనాన్ని దోచుకున్నట్లు ఎక్కడా ఒక్క కేసు కూడా లేదు. కేవలం.. తండ్రి   అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ లబ్ధి పొందాడనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి. దీనిపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అది కూడా వైఎస్ మరణం తర్వాతే టీడీపీ-కాంగ్రెస్ కలిపి జగన్ పై కేసులు పెట్టాయి.  అందులోనూ ఒక్క కేసు కూడా రుజువు కాలేదు.ఇలాంటి నేపథ్యంలో.. కేంద్ర మంత్రి  ఇలా ఎలా ఆరోపణలు చేస్తారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్ కి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటాడని, వైఎస్ పెద్ద దొంగ, జగన్ చిన్న దొంగ అంటూ విమర్శించారు. ప్రతిపక్ష నేత గురించి ఇంతలా విమర్శిస్తున్న రాజుగారి.. సొంత ప్రభుత్వంలో జరిగే అవినీతి గురించి మాత్రం ఎక్కడా మట్లాడరు. పట్టిసీమలో అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ తేల్చి చెప్పింది. మరి దాని గురించి కూడా రాజుగారు మాట్లాడితే బాగుంటుంది.

 

loader