కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి, వైద్యానికి  మోదీ సర్కారు పెద్ద పీట వేసింది. పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భవ పథకం కింద..  హెల్త్ స్కీంని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కేటాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.

 జైట్లీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు..

1.టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి

2.ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి

3.కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి

4.ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు

5.టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500

6.ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ స్కీం (ఆయుష్మాన్‌ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా

6.ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం

7.ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల మందికి లబ్ధి