నిరుద్యోగులకు శుభ వార్త

First Published 20, Dec 2017, 7:32 PM IST
central governament announce new jobs
Highlights
  • నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
  • 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన

దేశవ్యాప్తంగా ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆద్వంర్యంలో పనిచేసే సంస్థల్లో  4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని ఆయన వెల్లడించారు.

ఆయన ఇవాళ లోక్‌సభకు ఇచ్చిన నివేదికలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీల గురించి మంత్రి వివరించారు. మార్చి 1,2016 నినేదిక ప్రకారం మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ స్పష్టం చేశారు. త్వరలో ఈ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగులపై వున్న అదనపు భారాన్ని తగ్గించి, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో పని వేగాన్ని పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు ఈ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పెంచమని ఎలాంటి ప్రతిపాదన రాలేదని, అందువల్ల పాత రిజర్వేషన్ల ప్రకారమే భర్తీచేయనున్నట్లు మంత్రి తెలిపాడు.
 

loader