Asianet News TeluguAsianet News Telugu

తహశీల్దార్ల అవినీతికి చెక్...?

  • ఎంఆర్వో కార్యాలయాలన్నింటిలో సీసీటీవీ కెమేరాలు
  • అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు
  • అసహనం వ్యక్తం చేస్తున్న అధికారులు
cctv cameras in MR O office

జనన ధ్రువీకరణ పత్రం కావలన్నా.. మరణ ధ్రువీ కరణ పత్రం పొందాలన్నా.. భూముల యాజమాన్య వివరాలు కావాలన్నా..పాస్ పుస్తకం పొందాలన్నా.. కచ్చితంగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిందే.

ఎంఆర్వో కార్యాలయానికి వెళ్లగానే ఈ పనులన్నీ జరుగుతన్నాయా అంటే.. కచ్చితంగా చెప్పలేం. ఎంతో కొంత ముట్ట చెబితేగానీ

ఈ పనులన్నీ జరిగే పరిస్థితి లేదు ఇప్పుడు.

దీంతో తహశీల్దార్ కార్యాలయాలన్నీ అవినీతికి మారుపేరుగా మారిపోయాయి. మరి వీటికి అడ్డుకట్ట వేసేదేలా.. ఎవరు లంచం తీసుకుంటున్నారు..

ఎవరు లంచాలు అధికారులకు ఎగజూపుతున్నారు.. వీటిని తెలసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంఆర్వో కార్యాలయాలన్నింటిలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

సీసీటీవీ కెమేరాలతోపాటు సిటిజన్ చార్టర్ ను తప్పనిసరి చేయడం.. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం వంటి చర్యలకు సిద్ధపడుతోంది.

ముఖ్యంగా జనన ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రం, ఇంటిగ్రేడెడ్ సర్టిఫికేట్, మ్యూటేషన్ ఈ-పాస్ పుస్తకాలు, ఎఫ్ లైన్ పిటిషన్ లాంటి సర్వీసుల్లో అక్రమాలు అధికంగా జరుగుతన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీటిని అరికట్టే చర్యలు మొదలుపెట్టింది. కాగా.. ప్రభుత్వం తీసుకున్న  

ఈ నిర్ణయం పట్ల అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చొరవతో ఎంఆర్వో కార్యాలయాల్లో అవినీతికి చెక్ పడుతుందేమో వేచి చూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios