(వీడియో) కెఫే కాఫీ డేలో బొద్దింకలు.. ప్రశ్నిస్తే చెంపదెబ్బె

CCD employee slaps customer
Highlights

సీసీడీలో కమ్మటి కాఫీ తాగాలనుకునేముందు ఈ వీడియో  ఒకసారి చూడండి.

కస్టమర్లే దేవుళ్లు అని పూజించకపోయినా పర్వాలేదు. కానీ, కనీసం వాళ్లను మనుషులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ, విదేశాల నుంచి భారత్ లో అడుగుపెట్టిన కేఫ్ కాఫీ డే వాళ్లకు, అందులో పనిచేసే ఉద్యోగులకు ఈ విషయం తెలియదనుకుంటా. తమ షాపులో కాఫీ తాగడానికి వచ్చిన వ్యక్తి ఓ ప్రశ్న వేసినందుకు కస్టమర్ అని కూడా చూడకుండా చెంప దెబ్బలు కొట్టింది అందులో పనిచేసే ఉద్యోగి. రాజస్థాన్ లోని జైపూర్ లోని ఓ సీసీడీలో మార్చి 12 న ఈ ఘటన చోటు చేసుకుంది.

అర్పన్ వర్మ అనే యువకుడు కాఫీ తాగడానికి జైపూర్ లోని ఓ కేఫ్ కాఫీ డే కు వచ్చాడు. అక్కడ నిల్వ సరుకుల మీద బొద్దింకలు ఉండటం చూసి ఉద్యోగలను ఆ విషయంపై ప్రశ్నించాడు. అంతే.... అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కోపం నశాలానికంటింది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్పన్ చెంప పగలగొట్టింది.

 

 

loader