నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సందర్భంగా స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మొన్నటి వరకు ఈ-కామర్స్ వెబ్ సైట్స్ మాత్రమే  స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ప్రకటించేవి. ఇఫ్పుడు టెలికాం ఆపరేటర్లు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్, వొడాఫోన్లు సాంసంగ్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. సాంసంగ్, ఐఫోన్లపై పలు కంపెనీలు ఇస్తున్న క్యాష్ బ్యాక్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఫోన్..

ఆపిల్‌ అ‍త్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్సే. ఈ ఫోన్‌ 256జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు. రూ.1,01,498గా లిస్టు అయిన  ఈ ఫోన్‌ను క్యాష్‌బ్యాక్‌ అనంతరం రూ.97,498కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 88,698 రూపాయల 64జీబీ వేరియంట్‌ను కూడా రూ.4000 క్యాష్‌బ్యాక్‌తో రూ.84,698కే వినియోగదారులకు అందుబాటులో ఉంది.

సాంసంగ్ నోట్8..

అమెజాన్‌ పే ను వాడుతూ నోట్‌ 8ను కొనుగోలు చేసిన వారికి రూ.8000 క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ను కస్టమర్‌కి పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్‌ పేలో  ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని క్రెడిట్‌ చేస్తారు. ఈ ఆఫర్ జనవరి 10వ తేదీ వరకు మాత్రమే.