కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం (వీడియో)

కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం (వీడియో)

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ప్రమాదం జరిగింది. మారుతి  ఆల్టో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమైన విషాద సంఘటన నవాబ్ పేట మండలం జంగమయిపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. జంగమయిపల్లి అటవీ ప్రాంతంలో TS08EU1120 అనే నంబర్ గల మారుతి ఆల్టో కారు తగలబడిపోవడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి  సజీవదహనమైనట్లు గుర్తించారు. శరీరం మొత్తము కాలి పోయి అస్థిపంజరంగా మారిన స్థితిలో అతడి మృత దేహం ఉంది.


 కారు నెంబర్ ఆధారంగా  మహబూబ్ నగర్ డిఎస్పీ భాస్కర్ బృందం విచారణ చేపట్టింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన వివరాల ప్రకారం ఈ కారు హైదరాబాద్ కి చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తన వద్ద ఎలాంటి కారు లేదని, ఈ ఘటనకు తనకు ఎలాంటి సంభందం లేదని చెబుతున్నాడు.  దీంతో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇది హత్యా ..? ఆత్మహత్య..? కారు ప్రమాదమా ..? అనే కోణంలో మహాబూబ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

కారు తగలబడుతున్న వీడియో

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos