పాత చట్టాల వల్ల వాట్సాప్ గ్రూప్ లో వచ్చే అన్ని అంశాలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే గతంలో మహారాష్ట్రలో అరెస్టులు కూడా చేశారు. జమ్ము కశ్మీర్, జార్ఘండ్ లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. 

సోషల్ మీడియా వచ్చాక... భావప్రకటన స్వేచ్ఛ మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాట్సాప్, టెలీగ్రామ్ లాంటి సామాజిక అనుసంధాన యాప్ లతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది.

ఈ యాప్ ల వల్ల ఒక విషయం నిమిషాల్లో దేశం మొత్తం వెళ్లిపోతోంది. అయితే దీని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి.

ఉదాహరణకు ఒక వాట్సాప్ గ్రూప్ లో ఒక వ్యక్తి అసభ్యకర సందేశాన్నో, ఎవరినైనా కించపరిచే కామెంట్స్ పెట్టారని అనుకుందాం.

దాన్ని ఆధారంగా చేసుకొని ఆ సందేశం తో ఎలాంటి సంబంధం లేని ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

దీనికి ప్రధాన కారణం ఏళ్ల నాటి మన చట్టాలే. వాటిలో ఇప్పటి వరకు సరైన మార్పులు చేయకపోవడమే.

పాత చట్టాల వల్ల వాట్సాప్ గ్రూప్ లో వచ్చే అన్ని అంశాలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే గతంలో మహారాష్ట్రలో అరెస్టులు కూడా చేశారు. జమ్ము కశ్మీర్, జార్ఘండ్ లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి.

కానీ, ఇక్కడ చట్టం ఒక విషయం గమనించడం లేదు. అడ్మిన్ గా ఉన్నప్పటికీ తన గ్రూప్ లోని సమాచారాన్ని అతను తొలగించలేడు. ఇక్కడే ప్రభుత్వం, చట్టాలు అమలులో విఫలమవుతున్నాయి. వాట్సాప్ కు ఉన్న పరిమితులు, సాంకేతిక అవరోధాలను మన చట్టాలు సరిగా అర్థం చేసుకోవడం లేదు.

దీంతో అమాయకులు బలైపోతున్నారు.

అయితే ఈ అంశంపై వాట్సాప్ అడ్మిన్ లకు ఊరటనిచ్చే అంశాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది.

ఢిల్లీ హై కోర్టు ఈ విషయంపై స్పందిస్తూ ‘ అడ్మిన్ తన గ్రూప్ లో ఉన్న సందేశాలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని పేర్కొంది.

వాట్సాప్ అడ్మిన్ కు సంబంధించిన కేసు ఒకటి ఢిల్లీ హైకోర్టు ముందుకు రాగా దీనిపై విచారించినన్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ ఎన్ద్లా స్పందిస్తూ... గ్రూప్ లో జరిగే సమాచార మార్పిడికి అడ్మిన్ ఎలా బాధ్యత వహించాలంటారో నాకైతే అర్ధంకావడం లేదు‘ అని అన్నారు.అడ్మిన్ ను కేసులో నిందితుడిగా చేర్చడం సరికాదని పేర్కొన్నారు.

ఈ కేసు తదుపరి విచారణను 21 ఫిబ్రవరి 2017 కు వాయిదా వేశారు.