బీకాం లో ఫిజిక్స్ నుంచి  టీడీపీ నేతలు ప్రతి వ్యవహారంలో పప్పులో కాలేస్తూనే ఉన్నారు.

సోషల్ మీడియా పై, నెటిజన్ల రాతలపై చంద్రబాబు సర్కారు తీరు చూస్తుంటే... నేను చేస్తే సంపారం ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం అనే రీతిలో ఉంది.మెయిన్ మీడియాను కంట్రోల్ చేసినట్లు సోషల్ మీడియాను ఆయన, ఆయన పార్టీ నేతలు కంట్రోల్ చేయకపోవడంతోనే ఈ సమస్య మొదలవుతోంది.

బీకాం లో ఫిజిక్స్ నుంచి టీడీపీ నేతలు ప్రతి వ్యవహారంలో పప్పులో కాలేస్తూనే ఉన్నారు.

వారి తప్పిదాలను సోషల్ మీడియా ఉతికి ఆరేస్తూనే ఉంది. అందుకే చంద్రబాబు అండ్ కో కి సోషల్ మీడియా అంటే మింగుడు పడటం లేదు.

తమకు తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే జైలుకు పంపడానికి కూడా వెనకడాటం లేదు. సోషల్ మీడియాలో పొలిటకల్ సెటైర్లు వేస్తున్న ఇంటూరు రవి కిరణ్ అరెస్టు ఈ కోవలోనిదే.

ఆయన ఏపీ పెద్దల సభను అవమానించేలా కార్టూన్ లు, పంచ్ లు వేసి ఫేస్ బుక్ లో ప్రచారం చేశారనే కారణంతో ఏపీ పోలీసులతో అధికార పార్టీ అరెస్టు చేయించింది.

ఈ విషయంలో నేషనల్ మీడియా కూడా ఏపీ వైఖరిపై దుమ్మెత్తిపోసింది. భావప్రకటన స్వేచ్ఛ లేకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తూర్పారబట్టింది. అయినా చంద్రబాబు సర్కారు లైట్ తీసుకుంది.

పంచ్ లేసిన రవికిరణ్ నే కాదు వైసీపీ పార్టీతో ఆయనకు సంబంధం ఉందని ఆ పార్టీ సోషల్ మీడియా హెడ్ ను కూడా ఏఫీ పోలీసులు విచారించేలా అక్కడ సర్కారు చేయూత నిచ్చింది.

ఇదంతా బాగానే ఉంది. పెద్దల సభను అవమానంచారని ఆయనను అరెస్టు చేయడం సమంజసమే అనుకుందాం.

అయితే టీడీపీ సోషల్ మీడియా కూడా ఫేస్ బుక్ లో ఇదే పనిచేసింది. తెలంగాణ అసెంబ్లీని అవమానిస్తూ సాక్షాత్తు టీడీపీ సోషల్ మీడియాలోని అసభ్యకర ఫొటోలు పెట్టారు. అంటే రవికిరణ్ చేసిన పనే టీడీపీ సోషల్ మీడియా కూడా చేసింది.

ఏపీ అసెంబ్లీ మీద పంచ్ లేస్తే తప్పు... తెలంగాణ అసెంబ్లీ మీద పంచ్ లేస్తే ఒప్పు అవుతుందా...?

ఒక వేళ రవికిరణ్ ను అరెస్టు చేసిన సెక్షన్ లతోనే తెలంగాణ ప్రభుత్వం టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటే అప్పడు చంద్రబాబు ఏం సమాధానం చేప్తారు.

తాను చేస్తేనే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం అంటారా... టీడీపీ వేస్తేనే పంచ్ లు.. వేరే వాళ్లు వేస్తే బూతులు అంటారా... టీడీపీకి ఒక న్యాయం... మిగిలిన వాళ్లకు ఒక న్యాయమా...?