కర్నూలు టిడిపి ముఠా రాజకీయాలలో ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి బయటపడేమార్గం కోసం వెదుకుతున్నారు. వివాదం ఇంకా ముదరకు ముందే  నష్టంలేకుండా చిక్కులు విప్నేవిషయం చర్చించేందుకు ఈ మధ్యాహ్నం ఆయన జిల్లా టిడిపి నేతలతో సమావేశమవుతున్నారు.

కర్నూలుజిల్లా తలనొప్పికి ఒక మందు కనుగొనేందుకు ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూలు జిల్లా నేత‌లతో సమావేశమవుతున్నారు.

నంద్యాల ఉపఎన్నిక టికెట్ విషయంలో జిల్లా టిడిపి లు కలకలం మొదలయిన సంగతి తెలిసింది. ఈ టికెట్ ను భూమా కుటుంబానికే ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుకోవడం, ప్రతిదీవారికేనా, నేనేంకావాలని శిల్పా మోహన్ రెడ్డి ప్రశ్నించడం వివాదం రచ్చకెక్కింది. గత ఎన్నికలలో పోటీ చేసిన ఓడిపోయిన తనకే ఈ సీటు రావాలన్నది ఆయన వాదన. ఈ వివాదం పరిష్కరించడంలో ముఖ్యమంత్రి విఫలం కావడంతో శిల్పా పార్టీ వీడి వైసిపిలో చేరారు.

జిల్లా జూనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయిన మంత్రి భూమ అఖిల ప్రియ కింద పనిచేయడం ఎవరికీ ఇష్టం లేదు. అఖిల ప్రియ వంటి జూనియర్ మంత్రి వుంటే క్యాబినెట్ మీద లోకేశ్ పెత్తనం సాగుతుంది. అంతాసీనియర్ లుంటే కష్టం. అందువల్లబాబు భూమా కుటుంబానికి న్యాయం అనే నినాదంతో రాజీకాయాలు నడిపిస్తున్నారు.

తాజాగా భూమా వర్గానికి చెందిన ఏవీ సుబ్బారెడ్డి వివాదం కూడా మొదలయింది.

ఈ గందరగోళాన్నంతా సీఎం చంద్ర‌బాబు ఈ సమావేశంలో చ‌ర్చించ‌నున్నారు. 

అయితే, మంత్రి అఖిల ప్రియ మాత్రం ఏవీ సుబ్బారెడ్డి తో వివాదం లేదంటున్నది. ఆయన మామ అనే పిలుచుకునే చ‌నువున్న మాయింటి మనిషని అఖిల‌ప్రియ స్ప‌ష్టంచేశారు. విభేదాలు ఉంటే ఇరువురం కూర్చుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటామని ఎవరినీ దూరం చేసుకునేది లేదని చెప్పారు. ఏమైనా పొర‌పాట్లు ఉంటే స‌రిదిద్దుకోవ‌డానికి సిద్ధం మ‌ని మంత్రి అఖిల‌ప్రియ అన్నారు.