Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్... ఇక రైల్వే ఫుడ్ తినడం కష్టమే...

  • రైళ్లలో అమ్మే ఆహార పదార్థాలు మనుషులు తినేందుకు పనికిరావు, కాగ్ చెప్పేసింది
  • పురుగులు పట్టిన ఆహారం అమ్ముతున్నారు.
  • చద్దిదే వేడిపెట్టి ఇస్తున్నారు. కిచెన్లో ఆహార పదార్ధాల మీద మూత మూయరు.
  • ఈగలు ముసురుతున్నాయి, బొద్దింకలు తిరుగుతున్నాయి. పురుగు పుట్ర తారాడుతున్నాయి. రైలంతా ఎలుకలు
CAG report says railways food unfit for humans
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత దేశపు రైళ్లలో కనీసం మనుషులు తినే ఆహారం కూడా పెట్టడం లేదు.  మోదీగారొచ్చి మూడేళ్లయినా, కొత్త రైల్వే మంత్రి  వచ్చి ఏడాదయినా రైల్వే ఫుడ్ మార లేదు.

సురేష్ ప్రభుత్వ వస్తే రైల్వేలు బాగుపడ్తాయనుకున్నారు. అలా జరగలేదు.  ఈ మాట అన్నది  ఎవరో ప్రతిపక్ష నాయకుడు కాదు, కాగ్(CAG),కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రభుత్వం అజమాయిషీలో ఉండే అన్నింటిమీద ఒకచూపేసి అదెలా ఉందో చెప్పేదే కాగ్. కాగ్ చాలా అవమానకరమయిన కామెంట్స్ చేసింది రైల్వే అహారం మీద.  సురేష్ ప్రభు ఏమాంటారోచూడాలి.

రైళ్లలో వడ్డించే తిండిమీద ఈ వ్యాఖ్యలుచేసేముందుక కాగ్ 74 ప్రదేశాలలో80 రైళ్లలో కిచెన్ లను తనిఖీ చేసింది. ఆహారాన్ని తినిపరీక్షించింది.ఎక్కడ శుచి శుభ్రత పాటించకపోవడం చూసి కాగ్ దిగ్భ్రాంతి చెందింది. కామెంట్స్ చూస్తే వాంతికవుతుంది. రైళ్లలో ఫుడ్ తినడం మానేస్తారు.

కాగ్ ఏమనిందో చూడండి: రైళ్లలో అమ్మే ఆహార పదార్థాలు మనుషులు తినేందుకు పనికిరావు. పురుగులు పట్టిన ఆహారం అమ్ముతున్నారు. చద్దిదే వేడిపెట్టి ఇస్తున్నారు. అంతా కాలం చెల్లిన పొట్లాలు, బాటిల్సే. కిచెన్లో ఆహార పదార్ధాల మీద మూత మూయరు. ఈగలు ముసురుతున్నాయి, బొద్దింకలు తిరుగుతున్నాయి. పురుగు పుట్ర తారాడుతున్నాయి. రైలంతా ఎలుకలు ఎగురుతున్నాయి.కిచెన్ నిండా దుమ్ము పేరుకుపోయి ఉంది. ఇచ్చే ఆహారం  ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంది. అనుమతి లేని వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. ఒపెన్ మార్కెట్ కంటే చాలా ఎక్కవ రేట్లకు రైళ్లలో పుడ్ విక్రయిస్తున్నారు.

 డైరెక్టుగా టాప్ వాటర్ రైల్వే కిచెన్ లలో వాడుతున్నారు. టీ కాఫీలకు వాడే ది అదే నీరు.చెత్తకుండీలకు కనీసం మూత వుండదు. రెగ్యులర్ గా శుభ్రం చేయరు. వాటినసలు కడగరు.ఆహారానికి బిల్లులివ్వరు. మెన్యూ కార్డు లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios