అశ్లీల వీడియోలు మెసేజ్ లు చేసిన డ్రైవర్

cab drivers send the vulgar video
Highlights

అమ్మాయిలు జాగ్రత్త

ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన పని క్యాబ్ ఎక్కాలి అంటేనే ఆలోచించే పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే ‘వీ కేర్ ఫర్ యూ’ తెలిపిన వివరాల ప్రకారం  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఎంబీఎ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మే 8న తన ప్రయాణం కోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మొబైల్ నంబర్ డ్రైవర్ దగ్గరుంది. దీంతో అతను ఆ విద్యార్థినికి అశ్లీల మెసేజ్‌లు పంపిస్తూ వేధించసాగాడు. 

అయితే ఆ మర్నాటి నుంచి ఆమెకు ఒక నంబర్ నుంచి వాట్సప్‌లో స్నేహితుని పేరిట మెసేజ్‌లు రావడం మొదలైంది. దీంతో ఆమె ఆ నంబరును బ్లాక్ చేశారు. అయినప్పటికీ బాధిత విద్యార్థినికి చెందిన మరో నంబర్‌కు మెసేజ్‌లతో పాటు అశ్లీల వీడియోలు కూడా రావడం ప్రారంభమైంది. పోలీసులు బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను ఈ నంబరు ఆధారంగా మాటువేసి పట్టుకున్నారు.  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

loader