ప్రముఖ టెలికాం సంస్థ జియో... మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ రకాల ప్లాన్లను ప్రవేశపెడుతూ.. కష్టమర్లను ఆకట్టుకున్న జియో.. తాజాగా.. మరో ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ జియో ఫై హాట్ స్పాట్ డివైస్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ డివైస్‌ను రూ.1,999 ధరకు కొనుగోలు చేస్తే రూ.3595 విలువ గల బెనిఫిట్స్‌ను అందిస్తున్నది. ఈ బెనిఫిట్స్‌లో రూ.1295 విలువ గల ఉచిత డేటాతోపాటు మరో రూ.2,300 విలువ గల వోచర్లు ఉన్నాయి. వీటిని పేటీఎం,  రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో రిడిమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే రూ.1295 విలువైన ఉచిత డేటాను పొందాలంటే యూజర్లు రోజుకు 1.5 జీబీ/2జీబీ/3జీబీ డేటా లభించే ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా జియోఫై ధర రూ.999 మాత్రమే ఉన్నప్పటికీ దాన్ని రూ.1,999 తో కొనుగోలు చేస్తే పైన చెప్పిన ఆఫర్ లభిస్తుంది. అలా కాకుండా ఆఫర్ వద్దనుకుంటే రూ.999కే జియోఫై హాట్‌స్పాట్‌ను కొనుగోలు చేయవచ్చు.