Asianet News TeluguAsianet News Telugu

అయోమయంలో ‘బుట్టా’

  • బుట్టా రేణుక కి ఏమైంది..? చూడబోతే.. ఆమె అయోమయంలో ఉన్నారనిపిస్తోంది. అందుకే పూటకో మాట మారుస్తున్నారు.
  • మీరు కూడా రాజీనామా చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బుట్టా.. వింత సమాధానం చెప్పింది.
butta renuka sesational comments on pary change

బుట్టా రేణుక కి ఏమైంది..? చూడబోతే.. ఆమె అయోమయంలో ఉన్నారనిపిస్తోంది. అందుకే పూటకో మాట మారుస్తున్నారు. ఒకసారి తాను టీడీపీలో చేరనంటారు. మరోసారి చేరలేదంటారు. మరోసారి తాను టీడీపీ మద్దతు మాత్రమే పలికానంటారు. దీంతో..టీడీపీ-వైసీపీ నేతలల్లో ప్రస్తుతం బుట్టా రేణుక చర్చనీయాంశంగా మారారు.

విషయం ఏమిటంటే..పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వైసీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ వివాదం గత కొంత కాలంగా నానుతోంది. కానీ తాజాగా.. ఈ విషయంపై ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. తామంతా రాజీనామాలు చేశామని.. స్పీకర్ కోడెల వాటిని ఆమోదించలేదంటూ బాంబు వేశారు. దీంతో ఈ రాజీనామా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

ఇదే విషయంపై మీరు కూడా రాజీనామా చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బుట్టా.. వింత సమాధానం చెప్పింది. ‘‘నేను అసలు ఇంకా టీడీపీలో చేరలేదు... అలాంటప్పుడు రాజీనామా ఎలా చేస్తా’’ అని ప్రశ్నించింది. త్వరలో తన భర్త నీలకంఠ తో కలిసి టీడీపీలో చేరతానని.. ఆ తర్వాత రాజీనామా గురించి ఆలోచిస్తానని చెప్పారు. తాను కేవలం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితురాలినయ్యానని.. అంతేకానీ ఆ పార్టీలో చేరలేదని సమాధానమిచ్చారు. ఆమె సమాధానంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.

గత కొద్ది రోజుల క్రితం కూడా తాను టీడీపీ కేవలం మద్దతు మాత్రమే ఇచ్చానని ఆమె చెప్పారు. మద్దతు ఇవ్వడ మంటే పార్టీలో చేరడం కాదా? సరే కాదనే అనుకుందాం.. మరి ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన నానా హంగామా చేస్తూ తన కార్యకర్తలతో ఆమె ఏమి చేసినట్లు? అది పార్టీలో చేరడం కాదా? దానిని పార్టీలో చేరడం అని అనరా? అను అనుమానం మొదలౌతోంది. ఈ ప్రశ్నలకు కనీసం బుట్టా దగ్గరైనా సమాధానం ఉందో లేదో ఆమెకే తెలియాలి.

ఇదిలా ఉంటే.. బుట్టా రేణుక పార్టీ ఫిరాయించేందుకు చంద్రబాబు పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఆఫర్ చేశారని గతంలో ప్రచారం జరిగింది. అయితే.. ఆ ప్యాకేజీ విషయంలో చంద్రబాబుకి, బుట్టా కి తేడాలు వచ్చాయని.. అందుకే ఆమె కాసేపు టీడీపీలో చేరానని, కాసేపు చేరలేదని, మరికాసేపు త్వరలో చేరతాను అనే మాటలు చెబుతున్నారని ప్రచారం కూడా ఊపందుకుంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios