రూ.15కోట్లు అప్పు.. భార్య , బిడ్డలను దారుణంగా హతమార్చాడు..

Businessman kills wife, two daughters in sleep
Highlights

తాను కూడా ఆత్మహత్యకు యత్నం

ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ రత్నం టవర్స్ కి సమీపంలో ధర్మేష్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో నివసిస్తున్నాడు.

కన్ స్ట్రక్షన్ బిజినెస్ లో గత కొంతకాలంగా నష్టాలు రావడంతో దాదాపు రూ.15కోట్లు అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ విషయమై తరచూ ధర్మేష్ కి భార్య, బిడ్డలతో గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవ తీవ్రత మితిమీరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ధర్మేష్ తన దగ్గరున్న రివాల్వర్‌తో భార్యను, ఇద్దరు కూతుళ్లని చంపేశాడు. ధర్మేష్ పెద్ద కూతురు ఆర్కిటెక్చర్‌ కోర్సు పూర్తి చేసింది. తదుపరి ఎంబీఏ చేయడానికి ఆస్టేలియా వెళ్లే ఆలోచనలో ఉంది.


ఈ విషయాన్ని వెంటనే అతడి స్నేహితుడికి ఫోన్ ద్వారా తెలిపిన ఆ వ్యక్తి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోనున్నట్లు చెప్పాడు. కానీ, ఇంతలోనే సోదరుడు వచ్చి ధర్మేష్ ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ‘‘మేం కస్టడీలోకి తీసుకుని విచారించాం. రూ.15 కోట్ల అప్పు గొడవల వల్లే అతడు ఈ దారుణానికి పాల్పడడానికి కారణమని ఒప్పుకున్నాడు’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎన్ఎల్ తెలిపారు.

loader