ఆనంద్ మహీంద్రాను కలిచివేసిన వీడియో ఇది..

business tycoon annand mahindra inspired by one small child
Highlights

  • చిన్నిరిని చూసి స్ఫూర్తి పొందిన బిజినెస్ టైకూన్  ఆనంద్ మహీంద్రా
  • వైరల్ గా మారిన ఆయన  పోస్టు చేసిన వీడియో

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా  ఓ పెద్ద బిజినెస్ టైకూన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఆయన ఓ చిన్నారి నుంచి  స్ఫూర్తి పొందారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీనికి సంబంధించిన  ఆయన ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో తనను కలిచివేసిందని ఆయన ట్వీట్ చేశారు.అంతేకాదు.. ఆ వీడియోలోని  ఆ చిన్నారి నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పారు. వివరాల్లోకి వెళితే..

 

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. దీనిలో ఓ చిన్నారి పదేపదే జారుడుబల్ల ఎక్కి జారుతూ ఆనందంగా ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన మరో చిన్నారికి కాళ్లు, చేతులు లేవు. అయినా జారుడు బల్ల ఎక్కాలని అనుకుంది.   ఆ చిన్నారి బలమైన కోరిక ముందు అంగవైకల్యం కూడా చిన్నబోయింది. ఎంతో కష్టపడి ఆ చిన్నారి జారుడు బల్ల ఎక్కి అక్కడి నుంచి జారింది. ఆ సమయంలో చిన్నారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా పోస్టు చేస్తూ.. ‘ముందు నేను చూడలేకపోయా.. ఆ తర్వాత పూర్తిగా చూసి ఆశ్చర్యపోయా. ఇక ప్రపంచంలో ఏ పనైనా కష్టమైనది అని నేనేప్పటికీ భావించను’ అని ట్వీట్‌ చేశారు.

కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. చిన్నారి ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎందరికో ఈ చిన్నారి స్ఫూర్తిదాయకం అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

loader