ఘెర బస్సు ప్రమాదం 20 మంది మృతి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం


హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు ఉదయం ఘెర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మృతిచెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. బస్సు ప్రయాణికులతో సోలాన్ నుంచి కిన్నౌర్ కి వెళుతుండగా రామాంతపూర్ వద్ద లోయలో పడింది. క్షతగాత్రులను దగ్గరిలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.