కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్న బీఎస్ఎన్ఎల్

ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. అతి తక్కువ ధరకే ప్లాన్లను ప్రవేశపెడుతూ.. కష్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా.. తాజాగా రూ.26కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు రూ.26తో రీచార్జి చేసుకుంటే 2 రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. 150 ఎంబీ 2జీ/3జీ మొబైల్ డేటా లభిస్తుంది. ఇక దీంతోపాటు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1250కే 5 సంవత్సరాల వారంటీతో మోడెమ్‌ను అందిస్తున్నది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌కు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఆ తేదీలోగా రూ.249 ప్లాన్‌ను కస్టమర్లు పొందేందుకు వీలుంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు అన్‌లిమిటెడ్ నైట్ కాలింగ్ కస్టమర్లకు లభిస్తాయి.