బీఎస్ఎన్ఎల్ హ్యాపీ ఆఫర్

First Published 14, Jan 2018, 9:37 AM IST
BSNL Happy Offer Rs 186 Rs 187 Rs 349 Rs 429 Rs 485 Rs 666 Prepaid Plans Now Offer More Data More Validity
Highlights
  • స్పెషల్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
  • మోర్ డేటా, మోర్ వ్యాలిడిటీ

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  హ్యాపీ ఆఫర్ ప్రకటించింది. ప్రైవేటు టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియోలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పోటీని తట్టుకునేందుకు బీఎస్ ఎన్ ఎల్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే హ్యాపీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద పలు ప్యాక్‌లకు గాను వాలిడిటీని పెంచినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. రూ.186 ప్లాన్‌కు వాలిడిటీని 28 రోజులకు పెంచగా రూ.187కు 28 రోజులు, రూ.349కు 54 రోజులు, రూ.429కు 81 రోజుల గడువు నిర్ణయించారు. ఇక ఈ ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అలాగే రూ.485 ప్లాన్‌కు 90 రోజుల వాలిడిటీని అందిస్తుండగా, రూ.666 ప్లాన్‌కు 129 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.

loader