Asianet News TeluguAsianet News Telugu

ఆ బీఎస్ఎఫ్ జవాను చనిపోలేదు

తమ జవాను చనిపోలేదని డ్యూటీలో ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు.

BSF jawan Tej Bahadur is alive

తమకు అధికారులు సరైన తిండి పెట్టడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గగ్గోలు పెట్టిన విషయం గుర్తుందా...?

 

నాణ్యతలేని చపాతీలు, పాచిపోయిన కూరలు పెడుతున్నారని ఓ వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో పెట్టి జవాన్ తేజ్ బహుదర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపారు.

 

అయితే ఇప్పుడు మరోసారి ఆయన అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  పాపం.. సైనికుల కష్టాలను వెలికితీసిన ఆ జవాను మార్చి 22 న చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

http://newsable.asianetnews.tv/video/bsf-jawan-tej-bahadur-is-alive

 

వార్తలు రావడమే కాదు...ఇదిగో ఇదే ఆయన శవం అంటూ బెల్లెట్ గాయాలతో పడిఉన్న ఓ మృతదేశాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు.

 

అయితే తమ జవాను చనిపోలేదని డ్యూటీలో ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. తేజ్ బహుదూర్ భర్య కూడా తన భర్త బతికేఉన్నాడని చెప్పుకోవాల్సివచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios