హైదరాబాద్ నడిరోడ్డు మీద హత్య

broad day light murder in Hyderabads banjara hills
Highlights

హైదరాబాద్ లో నడిరోడ్డు మీద హత్య జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో  ఈ మట్టమధ్యాహ్నం మూడు గంటల సమయంలో నడిరోడ్డుపై వెళ్తున్న ఒక  వ్యక్తిని కొట్టి, కత్తులతో పొడిచి చంపారు.ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఘర్షణ ఈ హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో నడిరోడ్డు మీద హత్య జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో  ఈ మట్టమధ్యాహ్నం మూడు గంటల సమయంలో నడిరోడ్డుపై వెళ్తున్న ఒక  వ్యక్తిని కొట్టి చంపారు. 
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఘర్షణ ఈ హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.


పోలీసుల సమాచారం ఇలా ఉంది.


శనివారం మద్యాహ్నం మూడు  మూడున్నర గంటల మధ్య చారి అనే రౌడీ షీటర్  బంజారాహిల్స్ GVK ఎదురు రోడ్డు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు వస్తున్నాడు.
 రోడ్ నంబర్ 7లోని రత్నదీప్ స్టోర్ దగ్గరకు వచ్చాడో లేదో  వశీం అనే మరొక రౌడీ షీట్ మరో ఇద్దరు అనుచరులతో  కలిసి చారిని అడ్డగించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వశీం గ్యాంగ్ చారిపై కత్తులు దూసింది. కచకచా పోడిచింది. చేతులు, తలపై తీవ్ర గాయాలు అయి, రక్తం మడుగులో లోనే  చారి చనిపోయాడు. 


ఆ తర్వాత చంపిన గ్యాంగ్ లీడర్  నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హైదరాబాద్ లో అందునా బంజారా హిల్స్ లాంటి ప్రదేశంలో తమ కళ్లెదుటే హత్య జరగుతూ ఉంటే చుట్టూర జనాలు హడలిపోయారు. కొంతమంది షాపులకు షట్టర్లు వేసేశారు.


చిత్రమేమిటంటే  పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ హత్య జరిగింది. 
 

loader