తాగి కారు నడిపి బతుకు బుగ్గి పాల్చేసుకున్నారు

broad day light drunk driving kills two in Hyderabad
Highlights

  • మితిమీది తాగి  కారు నడిపిన యువకుల బృందం
  • చైతన్యపురిలో మెట్రో పిల్లర్ కు ఢీ
  • ఇద్దరు మృతి, మిగతావారి గాయాలు

పార్టీలో తెగ తాగి వాహనం నడిపి హైదరాబాద్ కుచెందిన కుర్రవాళ్లు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు.మరొక వ్యక్తి అవిటివాడయ్యే పరిస్థితి సృష్టించారు. ఈ ఘోరమయిన ప్రమాదం హైదరాబాద్ లోని చైతన్యపురిలో గురువారం నాడు జరిగింది. బర్త్ డే  ఫంక్షన్‌లో అర్ధరాత్రి దాకా  మద్యం బాగా సేవించి బిరియాని తినేందుకు బయలెళ్లారు.   వాహనం వేగంగా నడుపుతూ రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో రైల్  పిల్లర్‌ను ఢీ కొట్టారు. దీనితో కారు నుజ్జు నుజ్జు అయింది. ఫలితంగా  కారులో ఉన్న చైతన్య(24) అక్కడికక్కడే ప్రాణాలు  వదిలాడు. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన ఐదుగురు యువకుల్లో ఒక వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయాడు.

అంతేకాదు, పిల్లర్‌ను ఢీ కొట్టడానికి ముందు ఈ తాగుబోతుల కారు అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి వెళ్లడంతో అతని కాళ్లు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. సమీపంలోని పోలీసు స్టేషన్ కూడా ఉంది. వెంటనే

 ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిలో ఓ వ్యక్తిని విచారించగా , మద్యం సేవించినట్లు అగీకరించారుని. బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి ,విందులో పాల్గొని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని  అతను చెప్పినట్లు పోలీసుల తెలిపారు.గాయపడిన వారందరిని సమీపంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

loader