పెళ్లికొడుకును కట్టి, ఈడ్చు కెళ్లి పెళ్లాడిన పెళ్లి కూతురు (వీడియో)

పెళ్లికొడుకును కట్టి, ఈడ్చు కెళ్లి పెళ్లాడిన పెళ్లి కూతురు (వీడియో)

 పెళ్లికి అంతా సిద్ధమైంది. పెళ్లి కూతురు అందంగా ముస్తాబైంది.పెళ్లి చూడటానికి బంధువులు, స్నేహితులు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. కానీ.. అసలు ముఖ్యమైన వ్యక్తి అదేనండి పెళ్లి కొడుకు మాత్రం మండపానికి రాలేదు. తర్వాత ఏం జరుగుతుంది..? వరుడికి పెళ్లి ఇష్టం లేదు కాబోలు అని వధువు, ఆమె తరపు బంధువులు కన్నీరు పెడుతుంటారు. మన దేశంలో అయితే ఇలా జరుగుతుందేమో కానీ.. చైనాలో ఒక అమ్మాయి మాత్రం అలా బాధపడుతూ కూర్చోలేదు.పెళ్లికొడుకును దగ్గర ఉండి మరీ మండపానికి ఈడ్చుకొచ్చి  మరీ వివాహం చేసుకుంది. అయితే.. ఆ తీసుకురావడంలోనే కాస్త వైవిధ్యం కనపరిచింది. పెళ్లికొడుకుని చైన్లతో కట్టేసి మరీ బలవంతంగా రోడ్డుపై జరజరా ఈడ్చుకెళ్లింది. వదిలిపెట్టమని అతను ఎంత మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. ఇదంతా కొందరు ఔత్సాహికులు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టగా.. వీడియో కాస్త వైరల్ గా మారింది.ఆ వీడియో మీరు చూడండి ఓసారి.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos