మూడేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన.. యంగెస్టు డోనార్..

Brain dead toddler gives new lease of life to 3yr old girl
Highlights

  • బ్రెయిన్ డెడ్ అయిన 14నెలల బాలుడు
  • బాలుడి గుండెను మూడేళ్ల  పాపకు అమర్చిన వైద్యులు
  • ఇండియా యంగెస్ట్ డోనార్ గా గుర్తింపు

14నెలల బాలుడు.. మూడేళ్ల పాపకు ప్రాణం పోసాడు. సూరత్ కి చెందిన బాలుడు.. ఇంట్లో ఆడుకుంటూ.. పై నుంచి కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన బాలుడిని అతని తల్లిదండ్రులు హాస్పిటల్ కి తరలించగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో బాలుడి అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు.బాలుడి కిడ్నీలను అహ్మదాబాద్ లోని కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు తరలించారు.

అయితే.. అదే సమయంలో ముంబయిలోని ఓ మూడేళ్ల చిన్నారి.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని ఇక్కడి డాక్టర్లకు తెలిసింది. దీంతో బాలుడి గుండెని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించారు. 331.7కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి 1.25గంటల సమయంలో గుండెని ప్రత్యేక విమానంలో తరలించారు. విమానాశ్రయం నుంచి  హాస్పిటల్ కి  వెళ్లే దారిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ముందుగానే చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్ లో

 గుండెను ఫోర్టీస్ హాస్పటల్ కి తరలించి.. చిన్నారికి శస్త్ర చికిత్స చేశారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు. బాలుడు చనిపోతూ.. మరో బాలిక ప్రాణాన్ని కాపాడాడని.. అంతేకాకుండా అత్యంత చిన్న వయసులో అవయవ దానం చేసిన వ్యక్తిగా నిలిచాడు.

ముంబయిలోని జేజే హాస్పిటల్స్ లో 45ఏళ్ల  మహిళ నిన్న బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో ఆమె గుండెను ఫోర్టీస్  హాస్పిటిల్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మరో 32ఏళ్ల మహిళకు అమర్చారు. బుధవారం రెండు గుండె ట్రాన్సపరెంట్ లు చేశామని ఫోర్టీస్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు.

loader