కాంగ్రెసుకు సుప్రీం షాక్: బోపయ్య ఆధ్వర్యంలోనే బలపరీక్ష

Bopaiah will the protem speaker: SC
Highlights

 కాంగ్రెసు, జెడిఎస్ లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఓ మెలిక పెట్టింది. 

బెంగళూరు: కాంగ్రెసు, జెడిఎస్ లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఓ మెలిక పెట్టింది. కెజి బోపయ్య అధ్వర్యంలోనే యడ్యూరప్ప ప్రభుత్వ బలపరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బలపరీక్షను అన్ని టీవీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. కెజి బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెసు, జెడిఎస్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 

బోపయ్య చేత ప్రోటెమ్ స్పీకర్ గా గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. సీనియర్ శాసనసభ్యులను కాదని బోపయ్యను ప్రోటెం స్పీకర్ గా నియమించడాన్ని కాంగ్రెసు, జెడిఎస్ లు వ్యతిరేకించాయి. 

పైగా, బోపయ్య గతంలో యడ్యూరప్పకు అనుకూలంగా వ్యవహరించారని న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ముందు తన వాదన వినిపించారు.  

loader