ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో వందలాది మంది బ్రాంది షాపులు తెరవాలని  ప్రదర్శన చేశారు. షాపుల యజమానులు బైకు ర్యాలీ తీశారు. డిమాండ్ తగ్గట్టు దుకాణాలుండాలని వారి వాదన 

మందుబాబులకు, మద్యం షాపుల యజమానులు తోడయ్యారు. మద్యం షాపులు తెరావాలని ఈ రోజు ఏకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.కృష్ణా జిల్లా కైకలూరు లో ఈ ప్రదర్శన జరిగింది. మద్యం షాపులు తెరవండని ప్లకార్డులు పట్టుకుని వారు పట్టణం వీధులు గుండా నినాదాలు చేస్తూ హల్ చల్ చేశారు.రెండు రోజుల కిందట ఇదే వూర్లో జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దని మహిళలు గొడవచేశారు. ఇదే విధంగా జిల్లాలో పలు ప్రాంతాలలో షాపులకు వ్యతిరేకంగా మహిళలుగొడవ చేస్తున్నారు. మొన్నామధ్య విజయవాడలో ఒక దుకాణం మీద పడి బీభత్సం చారు. దీనితో మందబాబులు దుకాణాదారులు కూడా కౌంటర్ క్యాంపెయిన మొదలుపెట్టారు. కొంతమంది మహిళలను కూడా జమ చేశారు. మద్యం దుకాణాలు తెరవాలని, మద్యం కొరత తీర్చాలని నినాదాలు తీశారు.వీడియో లో ఉండేది కైకలూరు ప్రదర్శనలు.