Asianet News TeluguAsianet News Telugu

మందు బాబులకు శుభవార్త..!

  • ప్రస్తుతం మద్యం లభించే దుకాణాలు రాత్రి 10 దాటితే మూసివేయాలనే నిబంధన ఉంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను కాస్త సడలించబోతోంది. మరో గంట అదనంగా దుకాణం తెరచే సౌలభ్యాన్ని కల్పించబోతోంది.
booze sale till11 pm likely

 

మందు ప్రియులకు శుభవార్తే..  ఈ వార్త కనుక వింటే వారు కచ్చితంగా ‘మందు బాబులం మేము.. మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం..’  అంటూ డ్యాన్సులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ ఏమిటా శుభవార్త అంటారా.. మద్యం దుకాణాలను రాత్రి 11గంటల వరకు తెరచి ఉంచబోతున్నారు.

ప్రస్తుతం మద్యం లభించే దుకాణాలు రాత్రి 10 దాటితే మూసివేయాలనే నిబంధన ఉంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను కాస్త సడలించబోతోంది. మరో గంట అదనంగా దుకాణం తెరచే సౌలభ్యాన్ని కల్పించబోతోంది. అంటే.. రాత్రి 11గంటల వరకు ఈ దుకాణాలు తెరచి ఉంటాయి.  అదే కొంచెం కాస్ట్లీ మద్యం దుకాణం అనుకోండి... అర్థరాత్రి వరకు తెరచి ఉంచి మద్యం అమ్మకాలను జరపుకునే అవకాశం ఉంది.

దీనికి సంబంధించిన అప్రూవల్ ని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కి పంపిచారు. ఆయన కనుక దీనిని ఒకే చేస్తే.. ఈ విధానం అక్టోబర్  1నుంచి అమలులోకి వస్తుంది.  మద్యం దుకాణాల లైసెన్స్ పీరియడ్ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కాగా.. నెక్ట్స్ లెసెన్స్ పిరియడ్ లో ఈ విధానం అమలులోకి తేవడానిక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకసారి లైసెన్స్ తీసుకుంటే అది రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మద్యం డిమాండ్ ఎక్కువ గా ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు ఎక్కువగా ఏర్పాటు చేసి.. తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దుకాణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

దుకాణాల లైసెన్సుల ద్వారా ఈ సంవత్సరం రూ.7వేలకోట్లు ఆర్జించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. జనాభా ఆధారంగా హైదరాబాద్ నగరంలో 6 స్లాబ్స్ ఉండగా.. వాటిని 4కి కుదిస్తున్నట్లు సమాచారం. 

కాస్ట్లీ దుకాణాలో మాత్రం 25శాతం అదనంగా లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఇందులో అర్థరాత్రి వరకు మద్యం అమ్మేందుకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి.

తెలంగాణ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని చేకూర్చేది.. మద్యం దుకాణాలే. ఈ నిర్ణయం తో ఆదాయం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అధికారికంగా 10గంటలు దాటితే దుకాణాలు మూసివేాయాలనే నిబంధన ఉన్నప్పటికీ.. పలు దుకాణాలు అనధికారికంగా మరో రెండు గంటలు ఎక్కువగానే మద్యం సరఫరా  చేస్తున్నాయి. ఇక అధికారికంగానే 11గంటల వరకు మద్యం సరఫరా అవకాశం ఇస్తే.. అనధికారికంగా ఎన్ని గంటలు నిర్వహిస్తారో..వేచి చూడాలి.

మిగితా వాళ్ల సంగతి ఎలా ఉన్న.. మద్యం ప్రియులకు మాత్రం ఇది నిజంగా శుభవార్తే.

Follow Us:
Download App:
  • android
  • ios