సెలవంటూ వెళ్లిపోయిన నాటి బాలివుడ్ మహారాజు

సెలవంటూ వెళ్లిపోయిన నాటి బాలివుడ్ మహారాజు

అలనాటి బాలివుడ్ మేటి నటుడు, నిర్మాత శశికపూరు (79) కనుమూశారు. చాలా కాలం అనారోగ్యం తర్వాత ఆసుప్రతిలో ఆయన ఈ సాయంకాలం  ముంబాయి లోని కోకిలా బెన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు సమాచారంఅందింది. చాలా కాలంగా ఆయన కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు. నిరంతరం డయాలిస్ జరగుతూ ఉంది. కపూర్ కుటుంబం నుంచి వచ్చిన ఆణి ముత్యం ఆయన. పృధ్విరాజ్ కపూర్ మూడవ కుమారుడు ఆయన.  1938,మార్చి 18న కలకత్తాలో ఆయన జన్మించారు.హిందీ సినిమాలతోపాటు కొన్ని ఇంగ్లీషు చిత్రాలలో కూడా ఆయన నటించారు. ఆనారోగ్యం కారణంగా  ఆయన చనిపోయారని గతంలో కూడా వార్తలొచ్చాయి.  ఈ రోజు ఆయన మరణ వార్తని కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 2011లో ఆయన పద్మభూషణ్ అవార్డు లభించింది. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ని దాదా సాహేబ్ పాల్కే అవార్డు తో సత్కరించింది. ఆయన కు ఇద్దరుకుమారులు (కునాల్, కరణ్),ఒక కూతరు (సంజనా). భార్య ఇంగ్లీ ష్ నటి జెనిఫర్ కెండల్, చాలా కాలం కిందటే చనిపోయారు.

1961లో విడుదలయిన ధర్మపుత్ర ఆయన తొలిచిత్రం. మొత్తంగా 116 హిందీ చిత్రాలలో ఆయన నటించారు. 1960,70, 80 దశకాలలో ఆయన బాలివుడ్ లో తిరుగులేని నటుడు.మొహబ్బత్ ఇస్కో కెహ్తే (1965), జబ్ జబ్ ఫూల్ ఖిలే (1965) రాజాసాబ్ (1969),  జాన్వర్ ఔర్ ఇన్సాన్ (1972),  ఆ గలే లగ్ జా(1973) రోటీ కప్డా ఔర్ మకాన్, హీరాలాల్ పన్నాలాల్ (1978), దీవార్, సత్యం శివం సుందరం ఆయన నటించిన కొన్ని చిత్రాలు. ఆయన అమితాబ్ తో కలసి నటించిన 12 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో దీవార్ (1975), కభీ కభీ (1976), త్రిశూల్ (1978), కాలాపత్తర్ (1979) వంటి చిత్రాలున్నాయి.మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్ కు చెందిన హౌస్ హోల్డర్ (1963), షేక్స్ ఫియర్ వాలా(1965), బాంబే టాకీ(1970), హీట్ అండ్ డస్ట్ (1982) వంటి ఇంగ్లీష్ చిత్రాలలో కూడా ఆయన నటించారు. 1996 గలివర్స్ ట్రావెల్స్ తో ఆయన సినిమాలనుంచి రిటైరయ్యారు.

 

శశికపూర్ మృతికి రాష్ట్రపతి  కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.

 

 

ఆమిర్ ఖాన్ నివాళి

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page