బాలీవుడ్ సింగర్ యశ్ వదాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న పై లైంగిక వేధింపుల కేసు న‌మోదైయింది. లైంగిక వేధింపుల కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నన్నారు. య‌శ్ వ‌దాలి బుధవారం స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైయ్యారు. ఆ వేడుక‌లో వదాలి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అందరి ముందు అసభ్య పదజాలంతో దూషిస్తూ, దుస్తులు పట్టుకుని లాగి వేధించాడని ఆమె త‌న పిర్యాదు లో పెర్కొంది.

 దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వదాలిని అరెస్టు చేశారు. వదాలిని శుక్రవారం దిండోషి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.