సల్మాన్ మాత్రమే దోషి...మిగతా నటులు నిర్దోషులు

First Published 5, Apr 2018, 12:09 PM IST
Bollywood actor Salman Khan convicted in poaching case
Highlights
కృష్టజింక వేట కేసులో జోథ్ పూర్ కోర్టు సంచలన తీర్పు

కృష్ణ జింకను వేటాడిన కేసులో బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్తారిస్తూ జోథ్ పూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద సల్మాన్ ను దోషిగా నిర్ధారిస్తున్నట్లుమ న్యాయస్థానం వెల్లడించింది. మరి కాసేపట్లో శిక్ష ఖరారు చేసి సల్మాన్ ను జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో అభియోగాలు ఎదురుకొంటున్న మిగతా నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురిని కోర్టు నిర్దోషులగా ప్రకటించింది.  

1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్కడ కృష్ణ జింకలను వేటాడినట్లు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన వారు సల్మాన్ తో పాటు మరికొందరు నటులపై వన్యప్రాని సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 20 ఏళ్లుగా ఈ కేసు పై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈ  కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుదివాదనలు పూర్తయ్యాయి. అయితే తుది తీర్పును చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.  జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. అయితే మిగతా ఐదుగురు నటులను నిర్దోషులంటూ జోథ్‌పూర్ కోర్టు తీర్పునిచ్చింది.

అయితే తీర్పు వెలువరించిన న్యాయస్థానం శిక్షను మాత్రం ఖరారు చేయలేదు. కాసేపట్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ను జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే ఆయన కోసం జైలు సిబ్బంది ఓ గదిని ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

loader