పడవబోల్తా.. నలుగురు విద్యార్థులు మృతి

పడవబోల్తా.. నలుగురు విద్యార్థులు మృతి

మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి నగరానికి 135కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్నాక బీచ్ లో పడవ బోల్తా పడింది. ఆ సమయంలో పడవలో 40మంది విద్యార్థులు ఉన్నారు. పడంగ సెలవలు కావడంతో విద్యార్థులంతా సరదాగా విహారయాత్రకు రాగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది సహాయ చర్యల నిమిత్తం రంగంలోకి దిగారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. 32 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించగలిగారు. దహాను సముద్ర తీరానికి రెండు నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది. గల్లంతైన విద్యార్థుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రంగంలోకి దిగిన కోస్టు గార్డు సిబ్బంది పడవలతో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీటితో పాటు ముంబయి నుంచి కూడా మరికొన్ని పడవలు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు దహను ప్రాంతానికి చేరుకున్నాయి. డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలిక్టాప్లర్లు కూడా చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు కోస్టు గార్డు పీఆర్‌వో వెల్లడించారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos