టికెట్ లేకుండా విమాన ప్రయాణం మొబైల్ లోనే బోర్డింగ్ ప్రాసెస్ చేేసేలా చర్యలు త్వరలోనే అమల్లోకి తెస్తామంటున్న ప్రభుత్వం
టికెట్ లేకుండానే విమానంలో ప్రయాణించవచ్చు. అంటే ఉచితంగానా అనుకుంటే పొరపాటే. సాధారణంగా మనం విమానంలో ప్రయాణించాలంటే ఆన్ లైన్ ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటాం. దాని సాఫ్ట్, హార్డ్ కాపీలను తీసుకొని.. విమాన ప్రయాణం చేస్తాం కదా. ఒకవేళ కంగారులో టికెట్ ఇంటి దగ్గరే మర్చిపోతే.. ఫోన్ లో కూడా ఈ-టికెట్ లేకపోతే అప్పుడు ఏమి చేస్తారు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగి పయనమౌతారు అవునా.ఇక ముందు అలాంటి సమస్యేమి ఉండదు. టికెట్ లేకుండా కూడా విమానం ఎక్కేయవచ్చు. అందుకు మన భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. కాకపోతే ఇది కేవలం డొమెస్టిక్ విమానాలకు మాత్రమే. అంటే కేవలం మన దేశంలో తిరిగే విమానాల్లో ఈ సౌకర్యం ఉంటుంది.
టికెట్ లాంటిది ఏమీ లేకుండా కేవలం ఫోన్ లోనే బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం ఫోన్ లోనే జరిగిపోతే.. ప్రయాణికులకు సమయం కలిసివస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విదేశాల్లో ప్రయాణించాలంటే కచ్చితంగా పాస్ పోర్టు ఉండాలి. కానీ డొమస్టిక్ విమానాల్లో ప్రయాణించడానికి పాస్ పోర్టు అవసరం లేదు. కానీ బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ప్రయాణికుడు తమకు సంబంధించిన ఏదో ఒక గుర్తింపు కార్డును వారికి చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ కి చాలా సమయం కూడా పడుతుంది. ఇవేమీ లేకుండా ఓ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెబుతున్నారు అధికారులు. దాని ప్రకారం టికెట్ బుక్ చేసుకున్న సమయంలోనే మన గుర్తింపు కార్డు( ఆధార్, పాస్ పోర్టు) ఐడీ, పూర్తి సమాచారం ఎయిర్ లైన్స్ డేటాబేస్ లోకి వెళ్లిపోతాయి.
దీంతో ప్రయాణికులు క్యూలో నిల్చొని తమ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం ఒక్కసారి అధికారులు చెక్ చేసి కన్ఫామ్ చేసుకుంటారు. అంతేకాకుండా అక్కడ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీని వల్ల టికెట్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ విధానాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 17 విమానాశ్రయాల్లో హ్యాండ్ బ్యాంగ్ ట్యాగ్ స్టాంపింగ్ ని ఆపేసినట్లు తెలిపారు. పూణె, రాంచి విమానాశ్రయాల్లో ఈ ట్రయల్ రన్ కూడా మొదలుపెట్టారట.
